Skip to main content

Posts

Showing posts with the label america

అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష

 అమెరికా       న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డ మెహుల్ గోస్వామి అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. 15 ఏళ్ళు జైలు శిక్ష~

సింహాసనాలు వద్దు, రాజులు వద్దు': ప్రపంచవ్యాప్తంగా 'నో కింగ్స్' ఉద్యమం ఉధృతం

' అమెరికా, అక్టోబర్ 23: ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులు ఉన్నఉన్న నాయకత్వాలకు వ్యతిరేకంగా అమెరికా వీధుల్లో ప్రారంభమైన "నో కింగ్స్" (No Kings) ఉద్యమం ఇప్పుడు సార్వత్రిక నిరసనగా మారింది. 'ప్రజలే అధికారం' (People are the Power) అనే నినాదంతో, రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే లక్ష్యంగా పౌరులు పసుపు రంగు దుస్తులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నియంతృత్వ ధోరణే ప్రధాన కారణం: ఈ ఉద్యమం తలెత్తడానికి ప్రధాన కారణం అమెరికన్ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల నియంతృత్వ ధోరణి మరియు అధికారం కేంద్రీకరణ. ఎన్నికలు, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రజల్లో ఏర్పడిన భయం, నాయకుడి చుట్టూ అధికారం కేంద్రీకృతం కావడంపై పెరుగుతున్న ఆందోళన ఈ ఉద్యమానికి మూలమైంది. 'అధికారం ఒక్క వ్యక్తి చేతిలోకి వెళ్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది' అనే భావన బలంగా మారింది. ఉద్యమానికి దారితీసిన కీలక అంశాలు:  నాయకుడి చుట్టూ అధికారం కేంద్రీకరణ: పాలకులలో నియంతృత్వ ధోరణి పెరగడం.   వ్యక్తి ఆరాధన (Cult of Personality): నాయకులను విమర్శకు అతీతులుగా, దేవుళ్లలా ఆరాధించే ధోరణి.  * వ్యవస్థల...

దక్షిణ కొరియాకు అమెరికా నుండి $350 బిలియన్ డిమాండ్ – ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు.

  సియోల్: నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, తాజాగా దక్షిణ కొరియాకు ఒక అంచనాకు మించి ఉన్న వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనతో వార్తల్లోకి వచ్చారు. గతంలో ఈ దేశంపై సుంకాలను విధించిన ట్రంప్, ఇప్పుడు వాటిని తగ్గించడానికి దక్షిణ కొరియాకు $350 బిలియన్ల నగదు చెల్లింపును డిమాండ్ చేశారు.                                                                                                 దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ డిమాండ్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉందని హెచ్చరించింది. జూలైలో రెండు దేశాల మధ్య సుంకాలను 25% నుండి 15%కి తగ్గించడానికి చర్చలు జరిగినప్పటికీ, ఈ కొత్త డిమాండ్ దేశానికి తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.                    ...

అమెరికా హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు: కొన్ని రంగాలకే మినహాయింపులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కొత్త హెచ్-1బీ వీసా ఫీజు దేశీయ ఐటీ మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన సృష్టించింది. ఈ నెల 21 నుండి అమల్లోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు విధించబడింది. ఈ ఫీజు ఒక ఏడాది పాటు అమలులో ఉంటుంది. తరువాత, అమెరికా చట్టసభ (కాంగ్రెస్స్) చట్టం చేస్తే, పూర్తిస్థాయి అమలు జరుగుతుంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే ఉద్యోగుల వార్షిక వేతనం సగటు 60,000–140,000 డాలర్ల మధ్య ఉండటంతో, కంపెనీలకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం సవాలుగా మారింది. అయితే, జాతీయ ప్రాధాన్యం ఉన్న రంగాల్లో, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం మినహాయింపులు ఉండవచ్చని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. సెక్షన్ 1 (సి) ప్రకారం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఈ మినహాయింపులపై అధికారం వినియోగించవచ్చు. మినహాయింపులు పొందే రంగాలు: ఫిజీషియన్లు వైద్య మరియు ఆరోగ్య పరిశోధనలు రక్షణ, జాతీయ భద్రత స్టెమ్ కార్యకలాపాలు ఇంధనం విమానయానం సైబర్ సెక్యూరిటీ అత్యంత నైపుణ్యం కలిగిన ఈ రంగాల ఉద్యోగులు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపులు పొందే అవకాశం ఉన్నందున,...