ఫిలిప్పీన్స్ కాల్మేగీ తుఫాను బీభత్సానికి 114 మందికిపైగా బలయ్యారు. భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు. దీంతో దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని, 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సెబూ ప్రావిన్స్ ని పట్టణాలను వరదలు ముంచెత్తాయని, ఎక్కువ నష్టం అక్కడే జరిగిందని చెప్పారు.
Local to international