Skip to main content

Posts

Showing posts with the label Anantapuram dist
  కమ్మ సంఘం అధ్యక్షులు దగ్గుపాటి కుటుంబ సభ్యులు ఆదివారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుపాటి ధనమని, శ్రీ దగ్గుపాటి ప్రకాష్ నాయుడు, శ్రీ దగ్గుపాటి శ్రీరాములు, మరియు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య స్వామివారి దివ్య సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద చేతులు జోడించి స్వామివారిని దర్శించుకుంటున్న వీరి దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. పండుగ వాతావరణంలో దగ్గుపాటి కుటుంబం దైవారాధనలో మునిగిపోయి, స్వామివారి ఆశీస్సులు పొందింది.  దేవస్థానం అభివృద్ధికి, జింకల పార్కు ఏర్పాటుకు హామీ ఈ సందర్శన అనంతరం, పెన్హోబిలం పాలకమండలి చైర్మన్ బరిలో ఉన్న దగ్గుపాటి సౌభాగ్యశ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ కీలక హామీలు ఇచ్చారు.   పాలకమండలి చైర్మన్‌గా అవకాశం లభిస్తే, పెన్నాహోబిలం దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన భక్తులకు భరోసా ఇచ్చారు.   పెన్నహోబిలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగా ప్రత్యేకంగా జింకల పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ...

ఒక్క ఛాన్స్ ప్లీజ్.-కరెంట్ గోపాల్

గుంతకల్ అక్టోబర్ 20: పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడే ఒక్క అవకాశం కల్పించాలని కరెంట్ గోపాల్,, గుంతకల్ డివిజనల్ పోలీసు అధికారిని కోరారు. ఆయన పేరు గోపాల్. ఇంటిపేరు ఉక్కీసుల. ఉక్కీసుల గోపాల్ అంటే ప్రజలు గుర్తుపట్టరు కానీ ఆయనను కరెంట్ గోపాల్ అని పిలిస్తే ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. ఉక్కీసుల గోపాల్ అలియాస్ కరెంటు గోపాల్ అంటే కరెక్ట్ గోపాల్ అనే పేరు అయన సంపాదించుకున్నారు.  వృత్తి రీత్యా ఆయన గ్రామపంచాయతీలో సీనియర్ ఎలక్ట్రీషియన్ గా ఎలాంటి అరమరికలు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరి మెప్పు పొందారు.  ప్రవృత్తి రీత్యా ఆయనలో దేశభక్తి భావనలు అణువు అణువులో నిండిపోయాయి.  దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల చరిత్రలు ఆయనకు కొట్టిన పిండి. వారి జయంతోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు వివరించి వారిలో దేశభక్తి భావనలు పెంపొందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం కోసం తహతహలాడిపోయారు. దీంతో గుంతకల్ పోలీస్ డివిజన్ అధికారి శ్రీనివాసులను సోమవారం కలిసి పోలీసు సేవలను కొనియాడే ఒక...