Skip to main content

Posts

Showing posts with the label Vidapanakal

భక్తి సేవా తత్పరులు పయ్యావుల సోదరులు

 ఆధ్యాత్మిక అడుగంటుకు విద్యుత్ వెలుగు! విడపనకల్లు గడేకల్లు చౌడమ్మ కొండపైకి 13 విద్యుత్ స్తంభాలు: పయ్యావుల సోదరుల మహాసేవ విడపనకల్లు, గడేకల్లు: దైవసేవే ధ్యేయంగా పనిచేసే భక్తులు, దాతల కృషి ఎప్పుడూ నిరుపమానమే. విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామస్థుల పాలిట అలాంటి దైవదూతల్లా నిలిచారు స్థానిక భక్తి సేవా తత్పరులైన పయ్యావుల సోదరులు. వారి చొరవతో గ్రామానికి వాయువ్య దిశలో ఉన్న చారిత్రక చౌడమ్మ కొండపై కొలువై ఉన్న పురాతన ఆలయాలకు విద్యుత్ సౌకర్యం లభించింది. భక్తుల కష్టాలు తీర్చిన దాతృత్వం ఈ చౌడమ్మ కొండపై శ్రీ భీమలింగేశ్వర స్వామి ప్రథమ ఆలయం, సూర్య చంద్రుల ప్రతీక అయిన శ్రీ చౌడేశ్వరి దేవి పురాతన దేవాలయం వెలసి ఉన్నాయి. కొండపైకి నిత్యం తరలివచ్చే భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటూ పూజలు, దేవరలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, కొండపైకి కనీస ప్రాథమిక వసతులు, ముఖ్యంగా విద్యుత్ సరఫరా లేకపోవడం ఆలయ అభివృద్ధి పనులకు, రాత్రి పూట భక్తుల సంచారానికి ప్రధాన అడ్డంకిగా ఉండేది. ఈ సమస్యను పయ్యావుల సోదరుల దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించారు. 13 పోల్స్ ఏర్పాటు... తీరిన చీకటి సమస్య ఆధ్యాత్మిక సేవాభావంతో ముం...

ఆహ్వానాన్ని మన్నించి పెళ్లికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు

  విడపనకల్ ఎంపీపీ కరణం పుష్పావతి భీమరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కుమారుడు మనీష్ ప్రభాకర్ రెడ్డి వెడ్స్ నక్షత్రల వివాహం గుంతకల్లు పిఎంఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది.ఈ వివాహానికి పలువురిని ప్రత్యక్షంగాను,మరి కొంతమందిని సమయభావం లేనందున మొబైల్ ఫోన్ల ద్వారా,మరి కొంతమందిని సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించడం జరిగింది.మా ఈ ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి హాజరై,నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుతో..._💐💐                     ఇట్లు          _మీ కరణం భీమరెడ్డి_   _కరణం పుష్పావతి భీమరెడ్డి ఎంపీపీ విడపనకల్._

మంత్రి పయ్యావుల స్ఫూర్తి... విడపనకల్లు – గడేకల్లు బీటీ రోడ్డు పూర్తి..

4 నెలల్లోనే 8.6 కి.మీ మార్గం నిర్మాణం విడపనకల్లు:  గ్రామీణ రహదారుల అభివృద్ధి స్ఫూర్తి తో రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్  విడపనకల్లు మండలంలో  విడపనకల్లు – గడేకల్లు నూతన బీటీ రోడ్డు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి చేశారు. 12 అడుగుల వెడల్పుతో, మొత్తం 8.600 కిలోమీటర్ల ఈ రహదారి కేవలం నాలుగు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చి మండల ప్రజలు మెప్పు పొందారు. ఆయన దారి రహదారి అన్న చందంగా, పయ్యావుల సోదరులు రూటే సపరేటు అని నిరూపించారు. సకాలంలో పూర్తి చేసిన పనులు ఈ రహదారి పనులను స్వయంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు పర్యవేక్షించారు. జూలై 5న గడేకల్లు గ్రామంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఆయన, కాంట్రాక్టర్‌కు నాలుగు నెలల్లోనే నాణ్యతతో కూడిన రహదారిని పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మంత్రి వ్యక్తిగత పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షల కారణంగా పనులు వేగవంతమై, అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయబడ్డాయి. మండల కేంద్రానికి మెరుగైన అనుసంధానం ఈ నూతన రహదారి పూర్తికావడంతో విడపనకల్లు మండలంలోని అనేక గ్రామాలకు మండల కేంద్రానికి చేరుకోవడం సులభమైంది. ప్రధానంగా విడపనకల్లు, ఆర్. కొట్టాల, గడేకల్...

పాల్తూరులో ఘనంగా కడ్లే గౌరమ్మ వేడుకలు.

ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్ మండల పాల్తూరు గ్రామంలో గురువారం కడ్లే గౌరమ్మవేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వీధుల నుంచి కడ్లే గౌరమ్మకు హారతులు ఇచ్చి మొక్కబడును తీర్చుకున్నారు. సాయంత్రం పలు వీధి నుంచి మహిళలు హారతులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కడ్లే గౌరమ్మ విగ్రహానికి వివిధ పుష్పాలతో, వివిధ చీరలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజల అభిషేకలు చేయించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

విడపనకల్ మండలం గాజుల మల్లాపురం,కరకముక్కల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,ఉరవకొండ వైసీపీ ఇన్చార్జ్,పిఎసి సభ్యులు వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా కొనసాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కరణం భీమరెడ్డి,భరత్ రెడ్డి,మండల కన్వీనర్ కురుబ రమేష్,లతవరం గోవిందు,సర్పంచ్ రామాంజనేయులు రెడ్డి,హంపయ్య,పాల్తూరు శివ,రామన్న,పురుషోత్తం ఆదిమూలం,కావలి వెంకటేష్, ఎర్రస్వామి రెడ్డి,వన్నారెడ్డి,ఆనంద్ రెడ్డి,బండే గౌడ్,బస్టాండ్ రాజు,గంగిరెడ్డి,మల్లికార్జున,ఓంకార్ రెడ్డి,నాగరాజు,రాజన్న,వన్నూరు స్వామి,శేఖర్,గురుదాస్,స్వామి తదితరులు పాల్గొన్నారు.

30 ఏళ్లుగా కడ్లే గౌరమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వితరణ

ఉరవకొండ :  విడపనకల్లు మండలం, పాల్తూరు గ్రామం, ఎస్సీ కాలనీలో కొలువైయున్న కడ్లే గౌరమ్మ దేవి ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కొనకొండ్ల వై. శివరామిరెడ్డి గత 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా వితరణ అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించడానికి అయ్యే ఖర్చును ఆయనే సమకూర్చారు. మూడు దశాబ్దాల సేవ  ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి 1995వ సంవత్సరం నుండి నేటి వరకు (దాదాపు 30 సంవత్సరాలుగా) ప్రతి ఏటా గౌరమ్మ దేవాలయ ఉత్సవాల కొరకు విద్యుత్ దీపాలంకరణ మరియు ఇతర సామాగ్రి కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఎమ్మెల్సీ శివరామరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా తమ దేవాలయానికి చేస్తున్నటువంటి సేవను మరువలేమ"ని కొనియాడారు. ఈ సంవత్సరం కూడా ఆయన సహకారంతో ఉత్సవాలకు అవసరమయ్యే విద్యుత్ దీపాలంకరణ సామాగ్రిని సమకూర్చుకున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఉదారతను గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు , మహేష్, ధనుంజయ, దేవేంద్ర నవీను, సుధాకర్, మహదేవ్, నాగప్ప, మాలింగా, ఉపసర్పంచ్ సుంకన్న, రామ...

ప్రజాఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడదరబెంచి,డొనేకల్లులో సంతకాల సేకరణ. ఉరవకొండ: విడపనకల్ మండలం కడదరబెంచి, డోనేకల్ గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పేద,మధ్యతరగతి ప్రజలకు వైద్యవిద్యను దూరంచేయాలన్న దుర్బుద్ధికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో కడదరబెంచి,డొనేకల్ గ్రామాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటీకరణను స్వాగతిస్తే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద,మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య కఠిన తరమవుతుందని, కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని వ్యతిరేకించాలని,రాబోవు రోజులలో ప్రజాఉద్యమంలా మారి,కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడనాడి,వెంటనే ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రాకెట్ల అశోక్ కుమార్,మండల కన్వీనర్ రమేష్,విడపనకల్ మండల సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి,మండల ఉపాధ్యక్షుడు బోయ నాగేంద్ర,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఉమాశంకర్,నాయకులు హంపయ్య,హేమంత్,గోపాల్,బద్రి,శేఖర్,మారయ్య,చిద...

విడపనకల్ రెవెన్యూ ఇంద్రజాలం: అంధుడికి అందని సమాచారం!

  విడపనకల్ (అక్టోబర్ 28): విడపనకల్ మండలంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అంధుడైన కురువ ఎర్రిస్వామికి భూ సమాచారం విషయంలో అధికారులు చుక్కలు చూపించారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలకు, పొంతన లేని సమాధానాలిచ్చి దరఖాస్తుదారుడిని గందరగోళానికి గురిచేశారు.  మ్యుటేషన్ గందరగోళం భూమి మ్యుటేషన్ సందర్భంగా 'గొలుసు ఆధారిత పత్రాలు' (Chain Documents) ప్రామాణికంగా తీసుకుంటారా? కేవలం రిజిస్ట్రేషన్ దస్తావేజులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా? ఏ చట్టం ఏం చెబుతోంది? అని ఎర్రిస్వామి ప్రశ్నించారు.  * దీనికి విడపనకల్ తాసిల్దార్ బదులిస్తూ, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా మ్యుటేషన్ చేస్తామని తెలిపారు.  * అయితే, గొలుసు పత్రాలు పరిశీలించకుండా మ్యుటేషన్ చేస్తే, ఆస్తి చరిత్ర, అమ్మకాలు-కొనుగోలు వివరాలు ఎలా తెలుస్తాయని ఎర్రిస్వామి అనుమానం వ్యక్తం చేశారు.  మరణ ధ్రువీకరణ పత్రాలతో మ్యుటేషన్! ఇదిలా ఉండగా, కొట్టాలపల్లికి చెందిన చంద్రబాబు తండ్రి నారాయణస్వామి అమ్మమ్మ మృతి చెందారు. కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన మరణ ధ్రువీకరణ ...

విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌కు ఎస్.సి. ఎస్.టి. విజిలెన్స్ కమిటీ వినతి

  గుంతకల్ రెవిన్యూ డివిజన్, అక్టోబర్ 27: ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తరుణంలో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న విడపనకల్లు ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్. హరి ప్రసాద్ యాదవ్ జిల్లా కలెక్టర్‌ను మీడియా ద్వారా కోరారు. విద్యార్థినుల ఆవేదన: గత కొద్ది రోజులుగా విడపనకల్ ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని హరి ప్రసాద్ యాదవ్ తెలిపారు. అక్టోబర్ 26, 2025 (ఆదివారం) మధ్యాహ్నం ఆయన వ్యక్తిగతంగా హాస్టల్‌ను సందర్శించారు.  * వార్డెన్ లేకపోవడం: తాను వెళ్లిన సమయంలో వార్డెన్ విధుల్లో లేకపోవడం గమనించారు. దీంతో ఆయన గేటు బయట నుంచే విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  * నాసిరకం భోజనం: ముఖ్యంగా, కడుపునిండా అన్నం పెట్టడం లేదని, చికెన్ ఇస్తే నీళ్లగా ఉండి కేవలం రెండు ముక్కలు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  * బెదిరింపులు: ఆహారం గురించి ప్ర...

వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గింపు: విడపనకల్లులో ట్రాక్టర్ల ర్యాలీతో రైతులకు అవగాహన

  విడపనకల్లు, ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 1 వ్యవసాయ పనిముట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించేందుకు విడపనకల్లు మండల కేంద్రంలో బుధవారం 'సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో కీలకమైన ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి రైతుల్లో చైతన్యం తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, రాయితీలను వివరించేందుకు వ్యవసాయ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మరియు రైతులు కలిసి మండల కేంద్రంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుతో రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి (ఏఓ) పెన్నయ్య, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (ఏసీటీఓ) రామకృష్ణ, వీఐఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) రమేష్ నాయక్‌...

_వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరణ

ఉరవకొండ:విడపనకల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురిఅవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఆవిష్కరించిన డిజిటల్ బుక్,క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని ఉరవకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి,రాష్ట్ర యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ కరపత్రాలను,క్యూఆర్ కోడ్ లను ప్రారంభించడం జరిగింది.     ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,దాడులు జరిగితే వాటి ఫొటోలు,దాడి జరిగిన సంఘటనలు డిజిటల్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేసి లోకేషన్‌ షేర్‌ చేయాలని సూచించారు.అనంతరం డిజిటల్‌ బుక్‌ యాప్‌ పోస్టరును విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పాల్గొన్నారు._