' పాసు పుస్తకాలు దొంగతనం', 'తప్పుడు కేసుల'తో వేధింపులు: అడ్వకేట్ స్వాతి ఆరోపణ ఒంగోలు/సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కనుమళ్ళ గ్రామంలో తరతరాలుగా నడుస్తున్న భూ వివాదం పతాక స్థాయికి చేరింది. తమ కుటుంబ వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డుల గందరగోళం, పాసు పుస్తకాల దొంగతనం, మరియు తప్పుడు కేసులతో స్థానిక రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ కోమటిరెడ్డి కోటీశ్వరి @ స్వాతి భర్త రాఘవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా రాష్ట్ర ఉన్నతాధికారులకు సంచలన ఫిర్యాదు దాఖలు చేశారు. 85 ఏళ్ల వృద్ధుడి రికార్డుల దొంగతనంపై ఫిర్యాదు రాఘవేంద్ర రెడ్డి తన ఫిర్యాదులో ప్రధానంగా తన 85 ఏళ్ల తండ్రి మన్నం కోటేశు @ కోటేశ్వర్ రావు మరియు తాత మన్నం కామయ్య వారసత్వ భూములను ప్రస్తావించారు. దొంగతనం ఆరోపణ: 451, 452 ఖాతా నంబర్లకు సంబంధించిన పాసు పుస్తకాలు, బైటిల్ పుస్తకాలు, పాత అడంగల్/పహణి వంటి కీలక పత్రాలను తన బాబాయి మన్నం రంగారావు, 2006లో నానమ్మ మరణించిన రోజున దొంగతనంగా తీసుకెళ్లాడని ఆరోపించారు. తప్పుడు చేర్పులు: తమ నాన్నగారి పేరున్న 338/3 సర్వే నెంబర్ (0.14 సెంట్లు) భూమిని అక్రమంగా చొప...
Local to international