Skip to main content

Posts

Showing posts with the label Karnataka

వృక్ష మాత..సాలు మరద తిమ్మక్క కన్ను మూత

 వృక్ష మాత సాలుమరద తిమ్మక్క కన్నుమూత: పర్యావరణ సేవకు అంకితమైన జీవితం వేలాది మొక్కలను నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసిన వృక్ష మాతగా పేరుగాంచిన సాలుమరద తిమ్మక్క (114) కన్నుమూశారు. ఆమె మరణ వార్త దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులను విషాదంలో ముంచింది. జీవితం – గొప్ప సేవ   వృక్ష మాత: సాలుమరద తిమ్మక్క కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా, మగడి తాలూకాకు చెందినవారు. ఆమె తన భర్తతో కలిసి ఎలాంటి సంతానం లేకపోవడంతో, మొక్కలను తమ పిల్లలుగా భావించి, వాటిని పోషించడం ప్రారంభించారు.   అసాధారణ కృషి: ఆమె సుమారు 80 సంవత్సరాలకు పైగా, ముఖ్యంగా హులికల్ మరియు కూడూరు మధ్య సుమారు 4.5 కిలోమీటర్ల జాతీయ రహదారి పొడవునా వేలాది (సుమారు 300కు పైగా) మర్రి వృక్షాలను (మరియు ఇతర వృక్షాలను) నాటి, వాటికి నీరు పోసి, సంరక్షించారు.  'సాలుమరద' అర్థం: కన్నడ భాషలో 'సాలుమరద' అంటే 'వరుసగా ఉన్న వృక్షాలు' అని అర్థం. ఆమె చేసిన ఈ గొప్ప కృషికి గుర్తుగా ఆమె పేరుకు ముందు ఈ పదాన్ని చేర్చారు. అందుకున్న గౌరవాలు ఆమె నిస్వార్థ సేవకు గుర్తింపుగా, తిమ్మక్క దేశంలో మరియు అంతర్జ...

జైల్లో ఖైదీల మద్యం పార్టీ వీడియో లీక్ – బెంగుళూరులో సంచలనం

  బెంగుళూరు:బెంగుళూరు సెంట్రల్ జైలులో మళ్లీ వివాదాస్పద వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల ఐసిస్‌ రిక్రూటర్‌కి జైలులో VIP సౌకర్యాలు కల్పిస్తున్న వీడియో లీక్ అయి చర్చనీయాంశమవగా, ఇప్పుడు మరో వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది. తాజాగా లీకైన వీడియోలో కొంతమంది ఖైదీలు జైల్లోనే మద్యం సేవిస్తూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైల్లో ఇంత సౌకర్యం ఎలా లభిస్తుందో అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, వీడియోలో కనిపించిన ఖైదీల వివరాలు సేకరిస్తున్నారు.

సింధనూర్ గాంధీనగర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల విరూపాక్ష దేవాలయ సందర్శన

  కర్ణాటక రాష్ట్రంలోని సింధనూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్‌లో వెలసిన ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి సందర్శించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ్ పెద్దలు, గ్రామ పెద్దలు మరియు పలువురు హిందూ బంధువులు పాల్గొని, తమ భక్తిని చాటుకున్నారు. ఈ పర్యటన స్థానికంగా ఆధ్యాత్మిక మరియు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ

పావగడ: Ex MP. T. Rangaiah హాజరైన అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య  ఆత్మీయ స్వాగతం పలికిన YNH కోట గ్రామస్తులు  కర్ణాటక రాష్ట్రంలోని పావగడ తాలూకా YNH కోట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా చేపట్టారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి YNH కోట గ్రామానికి చేరుకున్న మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య గారికి ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.              అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహం వద్దకు చేరుకుని మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు.                      ఈ కార్యక్రమంలో YNH కోట గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు

ఎఫైర్.. భార్యను 12 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త

బెంగళూరు:బెంగళూరు నగంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు ఎదుటే ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. వివరాల ప్రకారం, రేఖ (32) అనే మహిళకు భర్త లోహితాశ్వతో గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. తరచూ ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో రేఖ, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం వ్యక్తమైంది. భర్తకు రేఖ వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి, వారి మధ్య కలహాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా రేఖ తన కూతురుతో కలిసి ఇంట్లో ఉండగా, లోహితాశ్వ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో రేఖ ప్రవర్తనపై అతనికి అనుమానం కలగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆవేశంతో తన వద్ద ఉన్న కత్తితో వరుసగా 12 సార్లు రేఖపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. కన్న కూతురు ఈ దృశ్యం చూసి భయంతో విలపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన లోహితాశ్వను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థాని...