అనంతపురం: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం (ఏపీ కౌలు రైతు సంఘం) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కౌలు రైతులకు వెంటనే నెరవేర్చాలని, వారికి పూర్తి స్థాయి గుర్తింపు కల్పించాలని సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు ఇవే కౌలు రైతులు ప్రధానంగా ఆరు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని తక్షణమే అమలు చేయాలని సంఘం నేతలు స్పష్టం చేశారు. CCRC కార్డులు: క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) మంజూరు చేసే ప్రక్రియలో భూ యజమాని సంతకం నిబంధనను తొలగించాలి. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు జారీ చేయాలి. E-క్రాఫ్ట్ నమోదు: సాగు చేస్తున్న కౌలు రైతులందరినీ ఈ-క్రాఫ్ట్ కింద నమోదు చేసి, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. నూతన చట్టం: కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నూతన కౌలు చట్టాన్ని రూపొందించాలి. ఎక్స్‌గ్రేషియా: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్ల...
Local to international