Skip to main content

Posts

Showing posts with the label karur

తొక్కిసలాట ఘటనపై టీవీకే నేత అరెస్టు

  ట్రూ టైమ్స్ ఇండియా తమినాడు: కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు టీవీకే నేతలపై కేసులు నమోదు చేయగా.. తాజాగా కరూర్ పశ్చిమ జిల్లా కార్య దర్శి మథియాళను అరెస్ట్ చేశారు.                                         తొక్కిసలాట మృత్యుల సంఖ్య 41కు చేరటంతో మథియాళన్ సహా పలువురిపై హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించటం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయ్ రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఎఆర్లో పేర్కొన్నారు

కరూరులో తొక్కిసలాట – మరణాల సంఖ్య 39కి పెరిగింది.

కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా కరూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ – “నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.”

కరూరులో విషాదం – విజయ్ సభలో తొక్కిసలాట.

 కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ ఘోర విషాదానికి కారణమైంది. కరూరులో శనివారం రాత్రి జరిగిన ఆయన సభలో తొక్కిసలాట చోటుచేసుకోగా, 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్, ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. ప్రతి శనివారం రెండు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, నామక్కల్‌లో ఉదయం ప్రచారం ముగించుకుని సాయంత్రం కరూరుకు చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో వేలుసామిపురంలో సభ జరుగుతుండగా, విజయ్‌ను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంలో అనేక మంది ముందుకు దూసుకెళ్లారు. ఆహుతులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు గుంపులో ఇరుక్కుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో గందరగోళం తలెత్తింది. వెంటనే పోలీసు సిబ్బంది, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను ఆసుపత్రులకు తరలించారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 38 మంది మృతి చెందారని ధృవీకరించింది. క్షతగాత్రులు పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.