విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.
గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు.
గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ మృతి చెందడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వైద్యో నారాయణ హరి అనే మాటను సిబ్బంది మరిచి బాధితులను హరిమనిపిస్తున్న ఘటనలు ఒక్కొక్కటి కలవరపెడుతున్నాయి. సత్య కుమార్ యాదవ్ స్వగ్రామం గడే కళ్ళు కావడం కొసమెరుపు. వీటికి తోడు ఎదురులేని మనిషిగా చలామణి అవుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇలా కాలు ఇలాంటి ఘటనలు చేసుకోవటం మిక్కిలి విచారకరం. కూటమి ప్రభుత్వ O ఇలాంటి దుర్ఘటనలపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. అందుబాటులో లేని వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Comments
Post a Comment