Skip to main content

Posts

Showing posts with the label Vijayawada

కదిరి డిపో ఉద్యోగికి కార్మిక పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి: విజయవాడలో ఏకగ్రీవ ఎన్నిక

రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో ఎన్నిక విజయవాడ :ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (AP PTD) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కార్మిక పరిషత్ యూనియన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సత్యసాయి జిల్లా, కదిరి డిపోకు చెందిన బి. పెద్దన్న (STi) యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న విజయవాడలో జరిగిన కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు శేషగిరిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి ఈ. డి. ఆంజనేయులు, సీనియర్ నాయకుడు అజయ్ దేవానంద్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో బి. పెద్దన్న యూనియన్‌లో అధికారికంగా చేరి, ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. కార్మిక పరిషత్ రాష్ట్ర నాయకులు బి. పెద్దన్నకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో యూనియన్ మరింత బలపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ తిమింగళం – నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి

ఏసీబీ వలలో.. కమర్షియల్ తిమింగళం..!  -- నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి -- వేధిస్తూ అక్రమ వసూళ్లు -- వాణిజ్య శాఖలో అలజడి  విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖలో ఏళ్లుగా వేర్లు వేయి పాతుకుపోయిన అవినీతి రాక్షసులను వేటాడటంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారిగా తన కఠినత్వాన్ని చాటింది. గురువారం సాయంత్రం గవర్నర్‌పేట డివిజన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సాధారణ అటెండర్‌గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు రంగే చెరిపారు. శ్రీనివాస్ వ్యాపారులను తరచూ బెదిరిస్తూ, తన అధికార పరిధిని మించిపోయి వారిపై తనదైన శైలిలో ఒత్తిడి తెచ్చి అక్రమ వసూళ్లు జరుపుతున్నాడన్న ఫిర్యాదులు చాలాకాలంగా ఏసీబీ దృష్టికి వచ్చాయి. పలు సార్లు పన్ను తనిఖీల పేరుతో వ్యాపారులను వేధించి నగదు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలపై అధికారులు గమనిస్తున్నారు. గతంలో కూడా అతను ఇలాంటి ఆరోపణలతో ఏసీబీ దాడుల్లో చిక్కి, 2017లో సస్పెన్షన్‌కు గురైనప్పటికీ, అలవాటును మార్చుకోలేకపోయాడని సహచరులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం అతను అవంతి ట్రాన్స్‌పోర్ట్ యజమానిని తనిఖీల సాకుగా బెదిరించి వేలల్లో లంచం వసూలు చేస్తుండగా, కచ్చితమైన సమ...

సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా - మంత్రి సత్య కుమార్ యాదవ్"

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం విజయవాడ సచివాలయంలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అనుకోని కష్టం వచ్చినప్పుడు, వారి కుటుంబాలకు సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఉద్ఘాటించారు. "ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా బలహీన కుటుంబాలకు తక్షణ ఉపశమనం లభిస్తోంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయం అర్హులందరికీ చేరేలా ఆరోగ్య శాఖ సమన్వయంతో నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు, మచిలీపట్నం, శ్రీశైలం లబ్ధిదారులకు సాయం మంత్రి యాదవ్ గుంటూరు, మచిలీపట్నం, శ్రీశైలం ప్రాంతాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ. 13,24,277 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబ పరిస్థితిని సమీక్షించి, అందుకు అనుగుణంగా సహాయం అందించామని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం," అని మంత్రి యాదవ్ నొక్కి చెప్పారు. "అవసర సమయాల్లో ప్రజలకు తోడుగా ఉండే ప్రభుత్వమే నిజమైన ప్రజా ప్...

విజయవాడ దుర్గగుడి ధర్మకర్తల మండలిలో 16 మంది కొత్త సభ్యుల నియామకం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం) ధర్మకర్తల మండలి పునర్‌వ్యవస్థీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ జాబితాను ఖరారు చేసింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా 11 స్థానాలు, జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. అదనంగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడకు చెందిన మార్తి రమాబ్రహ్మం, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్లను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే పోరంకి ప్రాంతానికి చెందిన బొర్రా రాధాకృష్ణను ఆలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకటించిన జాబితాతో ధర్మకర్తల మండలి పూర్తయింది. ఈ నియామకాలు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్నాయి. మండలి సభ్యుల జాబితా: విజయవాడ వెస్ట్ నుంచి అవ్వారు శ్రీనివాసరావు (బీజేపీ), విజయవాడ సెంట్రల్ నుంచి బడేటి ధర్మారావు (టీడీపీ), మైలవరం నుంచి గూడపాటి వెంటక సరోజినీ దేవి (టీడీపీ), రేపల్లె నుంచి జీవీ నాగేశ్వర్ రావు (టీడీపీ), హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ (టీడీపీ తెలంగాణ), తాడ...

విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను కలిసిన ఇ.డి. ఆంజనేయులు

  విజయవాడ: మంగళవారం (సెప్టెంబర్ 23, 2025) ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను ఏపీ రాష్ట్ర కార్మిక పరిషత్ కార్యదర్శి ఈ.డి. ఆంజనేయులు, పెద్దన్న మరియు ఇతర మిత్రులు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చర్చనీయాంశాలు ఈ భేటీలో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సమస్యలు, వారి సంక్షేమం, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ.డి. ఆంజనేయులు, పెద్దన్న తమ ప్రాంతంలో ఎస్సీ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, విద్యా, ఉపాధి అవకాశాలలో మెరుగుదల అవసరాన్ని చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారు తమ వినతులను ఆయనకు సమర్పించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ వారి సమస్యలను సానుకూలంగా ఆలకించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ఎస్సీ వర్గాల అభ్యున్నతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ఒక వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడనప్పటికీ, ఈ సమావేశం ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు దోహదపడుతుందనిరాష్ట్ర కార్మిక పరిషత్ కార్యదర్శి...

విజయవాడలో నేటి నుంచి వరల్డ్ ఫెస్టివల్ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్ సందడి.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఉత్సవ్ . సాయంత్రం 6 గంటలకు భవానీపురం పున్నమి ఘాట్‍లో వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడ ఉత్సవ్ వేడుకలను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్.