పెన్నహోబిలం: సంతానలక్ష్మీ అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు శనివారం (సెప్టెంబర్ 27) అమ్మవారు భక్తులకు సంతానలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) తిరుమల రెడ్డి పర్యవేక్షణలో, అర్చకులు ద్వారకనాథాచార్యులు, మయూరం బాలాజీ సిబ్బంది నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల అలంకరణల వివరాలు: * సెప్టెంబర్ 22 (సోమవారం): ఆదిలక్ష్మి * సెప్టెంబర్ 23 (మంగళవారం): గజలక్ష్మి * సెప్టెంబర్ 24 (బుధవారం): ధాన్యలక్ష్మి * సెప్టెంబర్ 25 (గురువారం): సౌభాగ్యలక్ష్మి * సెప్టెంబర్ 26 (శుక్రవారం): ధనలక్ష్మి సంతానలక్ష్మిగా ప్రత్యేక పూజలు: ఆరో రోజు సంతానలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి పసుపు, కుంకుమలతో విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలతో అమ్మవారిని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. అమ్మవా...
Local to international