Skip to main content

Posts

Showing posts with the label Bommanahal

బొమ్మనహల్ లో విషాదం: మాజీ ఎంపీ వాహనం ఢీకొని 9 గొర్రెలు మృతి, 15 గొర్రెలకు తీవ్ర గాయాలు

బొమ్మనహల్: మండల పరిధిలోని నేమకల్లు గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారీగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లడంతో 9 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే: ప్రమాదం జరిగిన తీరు: నేమకల్లు గ్రామ శివారులో గొర్రెల కాపరి గోవిందప్ప తన జీవాలను మేపుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. కాపరి ఆవేదన: కళ్ల ముందే తాను బిడ్డల్లా సాకుతున్న జీవాలు ప్రాణాలు కోల్పోవడంతో గొర్రెల కాపరిగోవిందప్ప కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ప్రమాదం వల్ల తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పరామర్శ: ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు మరియు గ్రామ పెద్దలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడిగోవిందప్ప కి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వ పరంగా తగిన సాయం అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త...

దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)

  దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)ఉరవకొండ ఆర్. టీ. సి డిపో మేనేజర్ గారికి మంగళవారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ. ఐ. ఎస్. ఏ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఉరవకొండ మండల అధ్యక్షులు మంజునాధ్ నాయక్ మాట్లాడుతూ.... దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి విద్యార్థులు ఉరవకొండ పట్టణం కు వచ్చి విద్యను అభసిస్తున్నారు. కావున వారికీ సరైన బసు సౌకర్యం లేదు బడి బసు కూడా లేదు విద్యార్థులు రోజు ప్యాసింజర్ బాసులో చాలా ఇబంధులకు గురి అవుతూ వారు రోజు ప్రయాణం చేస్తున్నారు అంతే కాకా వారికీ సరైన సమయం లో బస్సు లేక ఉన్న అది ఫుల్ అవ్వడం డోర్ లో వరకు నిలబడడం కొంత మంది విద్యార్థులకు బస్సు లో సీట్లు దొరకక వారు కళాశాలలకు, పాఠశాలలకు వారు సరైన సమయం వెళ్లలేక విద్యార్థులు ఇబంధులు పడుతున్నారు.కావున వీరి పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి ప్రత్యేక బడి బస్సు ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ. ఐ. ఎస్. ఏ నాయకులు సుధాకర్, ల...

క్లాసులకు 'గోవింద'వాడ టీచర్ డుమ్మా: స్కూల్ ఆవరణలో గంటల తరబడి సెల్‌ఫోన్ సంభాషణలు!

   అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల పరిధిలోని 'గోవింద'వాడ టీచర్ క్లాసులకు డుమ్మా కొడుతూ సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు చెబుతున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. బొమ్మనహల్ మండలం, గోవిందవాడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు స్కూల్ టైమింగ్‌లో తరగతులకు డుమ్మా కొట్టి, పాఠశాల ఆవరణలో గంటల తరబడి సెల్‌ఫోన్‌లో సంభాషణలు జరుపుతూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియమావళి ఉల్లంఘన: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పని వేళల్లో తప్పనిసరిగా విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పాఠశాల పని వేళలో అత్యవసరం కాని సెల్‌ఫోన్ సంభాషణలు జరపకూడదని విద్యా శాఖ నియమావళి స్పష్టంగా ఉంది. అయితే, ఈ ఉపాధ్యాయుడు నిబంధనలను ఉల్లంఘిస్తూ రోజూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని స్థానికులు మరియు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలకు తీవ్ర అంతరాయం: ఉపాధ్యాయుడు పిల్లలకు చదువు చెప్పా...

భక్తి కాంతులతో దర్గా హొన్నూరు: ఉరుసు ఉత్సవాలలో రెండవ దీపారాధన శోభ

  దర్గా హాన్నూర్ అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని దర్గా హొన్నూరు గ్రామంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నిర్వహించిన రెండవ దీపారాధన (రెండవ రోజు దీపోత్సవం) కార్యక్రమంతో దర్గా పరిసరాలన్నీ భక్తి కాంతులతో, దివ్య శోభతో ప్రకాశించాయి. శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు ఉరుసు ఉత్సవాలలో కీలక ఘట్టమైన దీపారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు.   దీపారాధన: ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం, స్వామి సమాధి వద్ద భక్తుల సమక్షంలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.   భక్తుల ఆకాంక్ష: ఈ సందర్భంగా వేలాది దీపాలను వెలిగించిన భక్తులు, ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు నెలకొనాలని, సకల జనులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దర్గా చుట్టూ దీపాల కాంతులు ఆవరించడంతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ ఉత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్న దృష్ట్యా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  ...

ఏడు నుంచి దర్గా హోన్నూరు ఉరుసుషరీఫ్ వేడుకలు ప్రారంభం .

  బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో వెలిసిన హజరత్ సయ్యద్ కాజాసయ్యద్ షో సోఫీ శర్మాస్ హుసేని స్వాములవారి 347 ఉరుసు వేడుకలు ఈనెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఏడో తేదీన శుక్రవారం గంధం, ఎనిమిదో తేదీ దీపారాధన,9వ తేదీ రెండవ దీపారాధన, పదవ తేదీ దేవుని సవారి, 11వ తేదీన జియరత్ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దర్గాను వివిధ రంగులతో సుందరంగా అలంకరిస్తున్నారు. జిల్లా నల్ల మూలల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తుల కోసం త్రాగునీరు ,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు . ఉరుసు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

గోవిందవాడ యన్నప్ప తాతకు కార్తీక శోభ

బొమ్మనహాళ్: అక్టోబర్ 26 – బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ గ్రామంలో కొలువైన అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ యన్నప్ప తాత స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా, ఆలయాన్ని దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్ది స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి పారవశ్యం: ఆలయ అర్చకులు మరియు భజన బృందం ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, వివిధ అలంకరణలు, అర్చనలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  * ప్రత్యేక ఆకర్షణ: స్వామి వారిని ప్రత్యేకంగా ఆకు పూజ మరియు రంగురంగుల పుష్పాలతో అలంకరించడంతో ఆలయం దివ్య తేజస్సుతో వెలిగిపోయిం ది.  * భక్తుల రద్దీ: కేవలం గోవిందవాడ నుంచే కాక, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకొని, కార్తీక మాస దీపాలు వెలిగించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మొత్తం మీద, యన్నప్ప తాత స్వామివారి ఆలయం కార్తీక మాస తొలి సోమవారం రోజున భక్తులతో కిటకిటలాడింది. మరో అంశాన్ని ఇలాగే మ...

అద్భుత ప్రతిభ చాటిన 'బసవన్నలు' : 9 గంటల్లో 20 ఎకరాల అలసంద సాగు పూర్తి!

  అనంతపురం జిల్లా (బొమ్మనహాల్): వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ, సాంప్రదాయ పద్ధతుల్లోని కృషి, ముఖ్యంగా పశు సంపద అందించే సహకారం వెలకట్టలేనిది అని నిరూపించే అపూర్వ ఘట్టం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బొమ్మనహాల్ మండలం, గోవిందవాడ గ్రామానికి చెందిన అంపన్న గారి స్వామి పొలంలో అలసంద సాగు కోసం ఉపయోగించిన జోడెద్దులు (బసవన్నలు) కేవలం 9 గంటల్లో 20 ఎకరాల సాగును పూర్తి చేసి రైతుల మన్ననలు పొందాయి. అలుపు సొలుపు లేకుండా... సాగు పనులు గురువారం ఉదయం 5 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయ్యాయి. అంటే, కేవలం 9 గంటల వ్యవధిలో అలసంద పంట విత్తనాన్ని 20 ఎకరాల్లో విజయవంతంగా సాగు చేశాయి. ఈ ప్రక్రియలో రైతు స్వామి తరఫున రేవన్న, రాముడు, గుడ్రు వన్నప్ప అనే ముగ్గురు రైతులు వంతుల వారీగా పాల్గొన్నారు. అయితే, మనుషులు మారినా, ఈ బసవన్నలు మాత్రం 'తగ్గేదే లేదంటూ' ఎలాంటి అలుపు సొలుపు లేకుండా, ఏకధాటిగా, అత్యంత ఉల్లాసంగా సాగును కొనసాగించడం అందరినీ అబ్బురపరిచింది. వాటి అద్భుతమైన కృషిని చూసి రైతులంతా ఉద్వేగానికి లోనై, "సహాబాష్ బసవన్నలు!" అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రైతులు కేరింతలు, ఈలలతో ఎద్దుల...

బొమ్మనహల్‌ పోలీసు స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజ

  ట్రూటైమ్స్ ఇండియా:అక్టోబర్ 1 దసరా శరన్నవరాత్రులు పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మనహల్‌ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) నబిరసూల్‌ నేతృత్వంలో సిబ్బంది అంతా కలిసి పోలీస్ స్టేషన్‌లో వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు నిత్యం ఉపయోగించే తుపాకులు, ద్విచక్ర వాహనాలు, కారుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగించే లాఠీలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాతకు మంగళ హారతితో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ఎస్‌ఐ నబిరసూల్‌, సిబ్బంది దుర్గామాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన కమల్‌ భాష, ధన సింగ్ నాయక్, జగదీష్, నాగార్జున, రుద్ర, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.