Skip to main content

Posts

Showing posts with the label Helth

మెలియాయిడోసిస్ లక్షణాలు ఇవే — జాగ్రత్తగా ఉండాలి

  ట్రాపికల్ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ మెలియాయిడోసిస్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి బర్క్‌హోల్డేరియా సూడోమాలి (Burkholderia pseudomallei) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా మట్టి, నిల్వ నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు గాయాల ద్వారా, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి శరీరంలోకి చేరాక, 48 గంటల్లోనే ప్రాణాంతక స్థితికి తీసుకువెళ్ళే ప్రమాదం ఉంది. వైద్య నిపుణుల ప్రకారం, మెలియాయిడోసిస్ లక్షణాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. మొదటగా తీవ్ర జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత న్యుమోనియా, శ్వాసలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, లివర్ లేదా ప్రొస్టేట్‌లో అబ్బెస్‌లు (పుళ్ళు) ఏర్పడవచ్చు. కొంతమందిలో ఈ వ్యాధి సెప్సిస్ అనే తీవ్రమైన రక్త ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్‌కి అత్యంత సులభంగా గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వర్గ...

ఆరోగ్యానికి వరంగా నిలిచే బొప్పాయి

మన ఆహారపు అలవాట్లలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో బొప్పాయి (Papaya) ఒక అద్భుతమైన సహజ ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుంది. బొప్పాయిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరల్‌ జబ్బులు దూరం అవుతాయి. మధుమేహ రోగులు కూడా భయపడకుండా ఈ పండును తినవచ్చు. దీనిలో సహజ చక్కెర తక్కువగా ఉండటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కలదు. మోకాళ్ల నొప్పులు, వయో సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి ప్రత్యేకంగా మహిళలకు ఉపయోగకరమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. నెలసరి క్రమబద్ధంగా రావడంలో, పాలు పెరగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ A, E, C, బీటా కెరోటిన్ అధికంగా ఉండటంతో చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న క్యాన్సర్, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడంలో కూడా బొప్పాయి పాత్ర విశేషమని వైద్య నిపుణులు అభిప్రా...