పావగడ: Ex MP. T. Rangaiah హాజరైన అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆత్మీయ స్వాగతం పలికిన YNH కోట గ్రామస్తులు కర్ణాటక రాష్ట్రంలోని పావగడ తాలూకా YNH కోట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా చేపట్టారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి YNH కోట గ్రామానికి చేరుకున్న మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య గారికి ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహం వద్దకు చేరుకుని మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో YNH కోట గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు
Local to international