Skip to main content

Posts

Showing posts with the label New Delhi

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన..... లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. "ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.  ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది  రిమాండ...

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి భారత్ వరుసగా ఏడోసారి ఎన్నిక - అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం

న్యూ ఢిల్లీ అక్టోబర్ 16 న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ దౌత్య వేదికపై భారత్ మరో కీలక విజయాన్ని, అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UN Human Rights Council - UNHRC) సభ్యదేశంగా భారత్ వరుసగా ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి ప్రారంభమయ్యే 2026-2028 మూడేళ్ల కాలానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో భారత్‌ను సభ్యదేశంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అంశాలు:  ఏడోసారి ఎన్నిక: భారత్ ఏడోసారి UNHRCకి ఎన్నికవడం దేశ అంతర్జాతీయ ప్రభావాన్ని, ప్రజాస్వామ్య విలువలకు ప్రపంచ దేశాల మద్దతును సూచిస్తుంది.   ఏకగ్రీవ ఎంపిక: ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం అనేది అంతర్జాతీయ సమాజంలో భారత్ మానవ హక్కుల రక్షణ, ప్రోత్సాహక చర్యలపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం.  పదవీకాలం: కొత్తగా ఎన్నికైన పదవీకాలం జనవరి 1, 2026 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2028 వరకు కొనసాగుతుంది.   ధృవీకరణ: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీష్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, భారత్‌కు మద్దతు తెలిపిన సభ్య దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు ఈ ఎన్నిక ఎందుకు క...

మూడో తరగతి నుంచే పాఠశాలల్లో AI పాఠాలు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!

న్యూఢిల్లీ: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచే పాఠశాలల్లో మూడో తరగతి (క్లాస్ 3) నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 'ఫ్యూచర్ వర్క్ ఫోర్స్'ను AI-రెడీగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సైతం AI టూల్స్‌ను ఉపయోగించి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు చిన్నతనం నుంచే AI సాంకేతికతపై ప్రాథమిక అవగాహన పెంచుకోవడానికి వీలవుతుంది. కాగా, ప్రస్తుతం కొన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో ఇప్పటికే AIపై పాఠాలను బోధిస్తున్నారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా AI విద్యను జాతీయ స్థాయిలో విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.

ప్రభుత్వ విమర్శ వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు తగదు: సుప్రీంకోర్టు

 ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7 న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఎంతమాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవoచాలని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం.. విమర్శనాత్మక వార్తలు రాసిన జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను మంజూరు చేసింది. 'ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి' అని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

ఓటుకు నోటు కేసులో ఎపి సీఎం చంద్రబాబు కు భారీ షాక్

ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు పరిధిలో మరోసారి చిక్కులు పెరిగేలా మారింది. ఈ కేసు కీలక వ్యక్తి మత్తయ్య తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ లేఖలో తాను ఓటుకు నోటు ఘటనలో తప్పు చేసినట్టు అంగీకరించిన మత్తయ్య, ఆ చర్య వెనుక చంద్రబాబు ప్రోత్సాహమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ అంశం వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు దిశ మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో, మత్తయ్య పాత్రపై దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ముందు మత్తయ్య లేఖ బయటకు రావడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మత్తయ్య లేఖలో పేర్కొన్న అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకునేలా పిటిషన్ రూపంలో దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఇప్పటికే సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ...

నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను .. 12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను శ్లాబ్‌లోకి వచ్చాయి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం . మధ్య తరగతి వారికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బోనాంజా లభించింది.. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది.. వారికి ఇది ప్రోత్సాహకరం. రేపట్నుంచి గృహోపయోగ పరికరాల ధరలు తగ్గనున్నాయి .. జీఎస్టీ తగ్గింపుతో దుకాణాల యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు.* నాగరిక్ దేవోభవ.. నినాదంతో మేం ముందుకెళ్తున్నాం.. జీఎస్టీ తగ్గించడంతో కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతోంది.* ఎంఎస్ఎంఈలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తుల విక్రయం పెరుగుతోంది .. రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతున్నాం .. విదేశీ వస్తువుల వినియోగం తగ్గాలి : ప్రధాని మోదీ