విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల ఉల్లంఘన రుజువు: హైకోర్టు సిఫారసుతో ఉద్యోగం నుండి తొలగింపు ఉద్యోగం నుండి తొలగింపుకు ప్రభుత్వం జీవో జారీ ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టిస్తూ, సస్పెన్షన్‌లో ఉన్న ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. కృష్ణవేణి పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సిఫారసు ఆధారంగా, శ్రీమతి కృష్ణవేణి కి అత్యంత కఠినమైన శిక్ష అయిన "Removal from Service" (ఉద్యోగం నుండి తొలగింపు) విధిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు (G.O.) జారీ చేసింది. విచారణకు దారి తీసిన ఆరోపణలు సీనియర్ సివిల్ జడ్జిపై చర్యలకు దారితీసిన అంశాలలో, హైకోర్టు విజిలెన్స్ శాఖకు అందిన పలు ఫిర్యాదులు కీలకంగా మారాయి. దీనితో పాటు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి (అనంతపురం) స్వయంగా సమర్పించిన (సుయో మోటో) నివేదిక ఆధారంగా మొత్తం పన్నెండు ఆరోపణలు (Articles of Charge) రూపొందించబడ్డాయి. ఈ ఆరోపణలపై విభాగ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు ఆరోపణలు రుజువు: నివేదిక సమర్పణ ఈ విభాగ విచారణ బాధ్యతను కడప ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి అప్పగించగా...
Local to international