ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నారు. ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాన్ని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ స్వయంగా చూశారన్నారు. అందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల నామినేషన్ సమయంలో మంత్రి సత్య కుమార్ ఊరేగింపుకు భారీ జన స్పందన వచ్చిందని.. అయితే ఆ జనం మధ్యన ఇరుక్కుపోయి నామినేషన్ కు సమయం ముగిసి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒక ఆటో డ్రైవర్ రావడంతో ఆటోలో వెళ్లి నామినేషన్ వేశారన్నారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి సంఘటన జరిగి ఉండదని.. ఆ రోజు ఆటో డ్రైవర్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ విధంగా మంత్రి సత్య కుమార్ తో పాటు మాకు ఆటో డ్రైవర్లతో ఎంతో అభినావ భావ సంబంధం ఉందన్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా చేయూతనందించాలన్న ఉద్దేశంతోనే పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా ఎంతో కొంత వారికి ఊరట లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పథకాల రూపంలో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతోందని.. అయితే ఎవరికైనా కావాల్సింది ప్రజల నుంచి అభినందనలు సహకారం అని అన్నారు. తమ ప్రభుత్వం కూడా ప్రజల నుంచి సహకారం మాత్రమే కోరుతోందని ఈ సందర్భంగా శ్రీరామ్ అన్నారు. మీ సహకారంతో మరింత ముందుకు వెళ్లే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. జనసేన నేత మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. ఈరోజు ఆటో డ్రైవర్లకు 15వేల ఆర్థిక సాయం అన్నది చాలా ఉపయోగపడుతుందన్నారు. దీనిపై డ్రైవర్లు కూడా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు...


Comments
Post a Comment