Skip to main content

Posts

Showing posts with the label Palnadu

స్వగ్రామంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రహ్మరథం!

  చెన్నయ్యపాలెం జన ప్రభంజనం: సామాన్య కార్యకర్తకు సమున్నత గౌరవం పల్నాడు జిల్లా, మాచవరం మండలం: విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో రెట్టింపు పండుగ వాతావరణం నెలకొంది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన తమ గ్రామబిడ్డ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊరంతా ఏకమై, దండులా కదిలి వచ్చి చైర్మన్‌కు బ్రహ్మరథం పట్టారు. శ్రమకు, పోరాటానికి దక్కిన సముచిత స్థానం సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సమున్నత పదవికి ఎదిగిన బ్రహ్మం చౌదరి ప్రస్థానం ప్రత్యేకమైనది. బాల్యంలో పట్టిన పసుపు జెండానే తన అజెండాగా మలుచుకుని, విద్యార్థి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఆయన కృషి, పట్టుదల, అవిశ్రాంతమైన పోరాటం పల్నాడు పౌరుషాన్ని రాష్ట్రమంతటా చాటిచెప్పాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బ్రహ్మం చౌదరికి ఉన్న అవ్యాజ్యమైన అభిమానం, తెలుగుదేశం పార్టీపై ప్రగాఢమైన ప్రేమ ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. ముఖ్యంగా, గత ప్రభుత్వ హయాంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని నిలబడిన వైనం ర...