సాలూరు: జాండీస్, మలేరియాతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె శనివారం స్వయంగా సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. “విద్యార్థులు పూర్తిగా కోలుకునేంతవరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. ఒక్క విద్యార్థి ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదు,” అని ఆమె స్పష్టం చేశారు. సాలూరు పరిసర ప్రాంతాల్లోని పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) డాక్టర్లు సమ్మెలో ఉన్న కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది విద్యార్థులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, అక్కడి వైద్య సిబ్బందికి మంత్రి సంధ్యారాణి ప్రత్యేక సూచనలు చేశారు. ఆమె వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, “సిబ్బంది కొరత ఉన్నా కూడా విద్యార్థుల వైద్యం విషయంలో ఎటువంటి ...
Local to international