ఉరవకొండ/మైలారంపల్లి: (సెప్టెంబర్ 27, 2025): అనంతపురం జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఈరోజు ఉరవకొండ మండలం, మైలారంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో నిర్వహించిన దాడుల్లో 21 మంది పేకాటా రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 77 వేల నగదుతో పాటు 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఇచ్చిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు (27.09.2025) తమ సిబ్బందితో కలిసి మైలారంపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 21 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, మోటారు సైకిళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు సీఐమహానంది తెలిపారు.
Local to international