Skip to main content

Posts

Showing posts with the label Amaravati

ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు

1 డీఎ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించాం. నవంబరు 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా డీఏ చెల్లింపు. రూ160 కోట్ల వ్యయం అవుతుంది పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం* రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం 60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించాం ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తాo.

మరో అల్పపీడనం.. రాష్ట్రంలో వర్షాల సూచన.

  అమరావతి : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రేపటినాటికి అక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది బుధవారానికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో ఇప్పటికే వర్షం పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నేడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ⚠️ అధికారులు ప్రజలు వర్షాలు, గాలులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సభాపతిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

అమరావతి: శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సభాపతి అయ్యన్నపాత్రుడి కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. సభాపతికి తాను వెళ్లి నమస్కరించడం మర్యాదేనని సీఎం స్పష్టంచేయడం విశేషం. శాసనసభ ప్రాంగణంలో ఇటీవల తీసుకున్న సభ్యుల గ్రూప్ ఫొటోను సీఎం ఛాంబర్‌కి అందజేయాలని మొదట సభాపతి సిబ్బందికి వర్తమానం పంపించారు. అయితే విషయం తెలిసిన సీఎం, స్పీకర్ వద్దకే స్వయంగా వెళ్లి ఫొటో అందుకున్నారు. ఈ సందర్భంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా అక్కడే ఉండగా, ఇటీవల తిరుపతిలో జరిగిన చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు విజయవంతం కావడంపై వారిద్దరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సదస్సులో పాల్గొనాలని తాను భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హాజరుకాలేకపోయానని, దీనికి విచారం వ్యక్తం చేసినట్లు సీఎం చెప్పారు. భాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కలిసి ముఖ్యమంత్రికి శాసనసభ్యుల గ్రూప్ ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

ధాన్యలక్ష్మీ గా ఉద్భవ లక్ష్మీ అమ్మవారు

 నేడు సౌభాగ్య లక్ష్మీగాఅమ్మోరు. అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, బుధవారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు మూడవ రోజు బుధవారం ధాన్యలక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.  ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.  ఉద్భవ లక్ష్మీ, ధాన్య లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవలతో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు  నేడు సౌభాగ్య లక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. సెప్టెంబర్ 25,తేదీ గురు వారం: సౌభాగ్య లక్ష్మిరూపం లో భక్తులకు దర్శన మిస్తారని ఈఓ తిరుమల రెడ్డి తెలిపారు.

ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ కొత్త పిటిషన్: ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఆరుపు.

అమరావతి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా గుర్తించమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్, ఫిబ్రవరి 5న స్పీకర్ ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమని, ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తింపున పొందడాన్ని నిరాకరించడంపై హైకోర్టు చట్టపరంగా తీరును నిర్ణయించాల్సిందని కోరారు. వైఎస్ జగన్, అసెంబ్లీ నియమావళి మరియు రాష్ట్ర ప్రత్యేక చట్టాలను ఆధారంగా, స్పీకర్ రూలింగ్ సరైనదని చెప్పలేమని వాదిస్తున్నారు. గతంలో స్పీకర్ జగన్‌ను అధికార ప్రతిపక్ష నేతగా గుర్తించకపోవడం, రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. హైకోర్టు ఈ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ చేసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ వర్గాలు, ఈ కేసు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపవచ్చని భావిస్తున్నాయి. ఈ పిటిషన్ వ్యవహారం, అసెంబ్లీ శక్తుల సంతులనం, ప్రతిపక్ష హక్కుల విషయంలో మలుపు తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు – వివేకా హత్య కేసులో సీఐ శంకరయ్య ఆందోళన

వివేకా హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఈనెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. నోటీసులో ఆయన పేర్కొన్నట్లు, తన సమక్షంలో నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారు. శంకరయ్య ఈ విషయంపై అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదనంగా, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ ఘటనా పరిణామాలు రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారి తెచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. వివేకా హత్య కేసు, సాక్ష్యాలను ధ్వంసం చేయడంపై ఉత్పన్నమైన వాదనలు మరియు ప్రభుత్వం పై ఎదురయ్యే సమాధానాలు ఈ వివాదాన్ని మరింత సున్నితంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో అధికార ప్రతినిధులు వ్యాఖ్యానాలు ఇవ్వలేదు. రాజకీయ, చట్టపరమైన పరిణామాలను ప్రాధాన్యతగా పరిగణిస్తూ మీడియా దృష్టి ఈ ఘటనపై నిలిచింది.

విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను కలిసిన ఇ.డి. ఆంజనేయులు

  విజయవాడ: మంగళవారం (సెప్టెంబర్ 23, 2025) ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను ఏపీ రాష్ట్ర కార్మిక పరిషత్ కార్యదర్శి ఈ.డి. ఆంజనేయులు, పెద్దన్న మరియు ఇతర మిత్రులు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చర్చనీయాంశాలు ఈ భేటీలో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సమస్యలు, వారి సంక్షేమం, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ.డి. ఆంజనేయులు, పెద్దన్న తమ ప్రాంతంలో ఎస్సీ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, విద్యా, ఉపాధి అవకాశాలలో మెరుగుదల అవసరాన్ని చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారు తమ వినతులను ఆయనకు సమర్పించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ వారి సమస్యలను సానుకూలంగా ఆలకించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ఎస్సీ వర్గాల అభ్యున్నతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ఒక వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడనప్పటికీ, ఈ సమావేశం ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు దోహదపడుతుందనిరాష్ట్ర కార్మిక పరిషత్ కార్యదర్శి...

సోషల్ మీడియాలో హద్దు మీరితే తాటతీస్తా: కడప ఎస్పీ

  సో ష ల్ మీడియా వేదికగా కొంతమంది హద్దులు దాటుతున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్కడపలో మాట్లాడారు. ‌ మీడియాతో మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు వారి పై స్పెషల్ డ్రైవ్ చేసి చర్యలు తీసుకుంటాంప్ప ఇప్పటికే జిల్లా 164 అకౌంట్లు గుర్తించాం హద్దు మీరితే తాట తీస్తామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు 

ఏపీలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పెద్ద ఉద్యమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆలస్యమవుతున్నందుకు రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 70 శాతం కాలేజీలు తాత్కాలికంగా మూతబెట్టినట్లు ప్రకటించబడింది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ (APPCAA) తెలిపిన వివరాల ప్రకారం, గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకావడం వల్ల కాలేజీల నిర్వహణ కష్టతరం అవుతోంది. విద్యార్థులకు సౌకర్యాలు అందించడంలో, స్టాఫ్ జీతాలు చెల్లించడంలో సమస్యలు తలెత్తినాయని యాజమాన్యాలు గుర్తు చేశారు. APPCAA ముఖ్య వ్యక్తులు గవర్నమెంట్ నుండి తక్షణ స్పందన లేకపోతే ఈ బంద్ ఈ నెల 27 వరకు కొనసాగుతుందని తెలిపారు. అంతేకాదు, అక్టోబర్ 6 నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వారిని హెచ్చరించారు. ఈ స్ధితి నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల మూతపెట్టడమే కాక, నిరాహార దీక్షల ప్రణాళిక వల్ల విద్యార్థుల విద్యాపై తీవ్ర ప్రభావం పడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, ప్రైవేట్ విద్యాసంస్థలు చేపట్టిన ఉద్యమం మరింత...

28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం.

సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు.. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు.. సాంకేతికతను అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయి.. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఐటీ రంగంలో భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉంది.. నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యత ఇవ్వడంవల్లే హైదరాబాద్ కు మేలు జరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి.. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీవారే.. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్ కు చెందినవారు. భారతీయ ఐటీ నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారే కావడం విశేషం.. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పతో రూపురేఖలు మారాయి : సీఎం చంద్రబాబు