ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్
కోర్టుల్లో న్యాయవాద వృత్తి చేయకుండా,ఇతర వృత్తుల్లో, వ్యాపారాల్లో లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్న న్యాయవాదులు తమ ప్రాక్టీస్ లైసెన్స్‌ను ఒక నెలలోపు సర్పెండర్ చేయాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఆదేశించింది.
కొంతమంది న్యాయవాదులు ప్రైవేట్ కంపెనీలు,ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని,అలాగే వ్యాపారాల్లో నేరుగా పాల్గొంటున్నారని,
అయినప్పటికీ,తమ దగ్గర న్యాయవాద వృత్తి చేసేందుకు లైసెన్స్ ఉంచుకుంటున్నారని ఒడిశా బార్ కౌన్సిల్ ముందు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై స్పందిస్తూ ఇలా చేయడం *Advocates Act,1961* నిబంధనలకు విరుద్ధమని ఒడిశా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ఈ నిబంధనల ప్రకారం....
👉అడ్వకేట్ నేరుగా వ్యాపారం చేయరాదు. అయితే,ఒక వ్యాపార సంస్థలో Sleeping Partner (రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనని భాగస్వామి)గా ఉండవచ్చు
కానీ ఆ వ్యాపారం స్వభావం న్యాయవాద వృత్తి గౌరవానికి విరుద్ధంగా ఉండకూడదు.
👉న్యాయవాది ఒక కంపెనీకి డైరెక్టర్ లేదా ఛైర్మన్‌గా ఉండవచ్చు.అయితే,ఎలాంటి ఎగ్జిక్యూటివ్ విధులు (రోజువారీ పాలన/నిర్వహణ పనులు) చేయరాదు.
👉న్యాయవాది Managing Director లేదా Secretaryగా పనిచేయరాదు.
👉న్యాయవాది ఒక పూర్తి సమయ జీతభత్య ఉద్యోగిగా ఎవరైనా వ్యక్తి, కంపెనీ,ఫర్మ్, ప్రభుత్వ సంస్థ,కార్పొరేషన్ వద్ద పనిచేయరాదు.ఒకవేళ అలాంటి ఉద్యోగం స్వీకరిస్తే,వెంటనే సంబంధిత బార్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.ఉద్యోగంలో ఉన్నంతకాలం ఆయన న్యాయవాద వృత్తి చేయరాదు.
అన్ని జిల్లాల బార్ అసోసియేషన్లకు లేఖలు పంపి, న్యాయవాద వృత్తి చేయని న్యాయవాదులు లైసెన్స్ వదలకపోతే,వారిపై చర్యలు తీసుకోవాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఒడిశా రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ లను సూచించింది.
లైసెన్స్ వదలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా బార్ కౌన్సిల్ ఆదేశించింది.
-------------------------------------------
ఇలాంటి చర్యల్ని మన AP బార్ కౌన్సిల్ ఎందుకు తీసుకో కూడదు..? అని కొంత మంది న్యాయవాదులు...

Comments
Post a Comment