ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 17:
వజ్ర కరూర్ మండలం చాబాల గ్రామంలోని శ్రీశ్రీ దర్గా వన్నూరు స్వామి దేవాలయం పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని, కి.శే. చెల్లూరు తిరుపాల్ శెట్టి, ఆయన సతీమణి విశాలమ్మ కుటుంబ సభ్యులు ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో, వారి కుమారులు నాగరాజు, విశ్వనాథ్ కలిసి గ్రామంలోని ధర్మపురి రోడ్డులో ఉన్న వారి తోటలోని సర్వే నెంబర్ 234-Dలో గల రూ. 2.30 లక్షల విలువైన భూమిని ఆలయ పెద్దలకు అప్పగించారు.
ఈ భూమిని ఆలయ పెద్దలైన శివలింగప్ప, కరే ధనుంజయ్య, కరే పరమేష్లకు కుటుంబ సభ్యులు అందజేశారు. దాతల దాతృత్వాన్ని ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఆలయ పెద్దలు దాతలకు శాలువా కప్పి, పూల మాలలు వేసి, దర్గా జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఆలయ పునఃప్రారంభ వేడుకను విజయవంతం చేశారు.

Comments
Post a Comment