గుజరాత్
గుజరాతకు వలసవచ్చిన UP, బిహార్ రాష్ట్రాల కార్మికులు దీపావళి సందర్భంగా సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో నిన్న సూరత్లోని ఉద్నా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టికెట్ల కోసం ఏకంగా రెండు కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వేలాదిగా వచ్చినవారిని అధికారులు అదుపు చేయలేకపోయారు~£