మాలేపాటి భానుచందర్ ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదంలో ముంచివేసింది. మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు కుమారుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి అన్న కుమారుడిగా.. దగదర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులుగా.. ఎంతోమందికి కొండంత అండగా ఉన్న మాలేపాటి భానుచందర్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని శోక సంద్రంతో వేడుకుంటున్నాను.
