- సందేహాస్పద ఆస్తి వసూళ్లు సాధ్యమా?
- లిమిటేషన్ యాక్టివ్ ఉల్లంఘన.
- సుప్రీంకోర్టు రూలింగ్ పూర్తిగా విల్లంఘన.
- గ్యారెంటీ దారుని హక్కుల భంగం.
ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా:
: బ్యాంకులో తీసుకున్న రుణ కాలపరిమితి మూడు సంవత్సరాలు. అలాగే జామీను పరిమితి సైత0మూడు సంవత్సరాల వరకే. రుణ గ్రహీత తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు ఓ వ్యక్తి గత 11 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్ జామీను దారున్ని తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు.
తీసుకొన్న బ్యాంక్ రుణాన్ని మూడు సంవత్సరాల్లో గా వసూలు చేసుకోవాలి. రుణకాల పరిమితి ముగిస్తే, జామీనుదారు కాల పరిమితి ముగిసినట్లే అని సుప్రీంకోర్టు రూలింగ్ స్పష్టంగా తెలియపరిచింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు లిమిటెడ్ వర్సెస్ సిడికో లెదర్స్ కంపెనీ లిమిటెడ్ 2014లో ఇచ్చిన రూలింగ్ లో గ్యారెంటీ దారుని పరిమితి మూడు సంవత్సరాల వరకే అలాగే 12 సంవత్సరాల వరకు కాదని స్పష్టికరించింది.
వివరాలు ఇలా ఉన్నాయి: ఉరవకొండ సిండికేట్ బ్యాంక్, ప్రస్తుతం కెనరా బ్యాంకు గా కొనసాగుతోంది. శ్రీ హనుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ మేకల కృష్ణవేణి, మేకల సుబ్బు దంపతులు తేదీ17-07-2014 నాడు షాపు ప్రారంభోత్సవానికి రూ 1,9900/లు రుణం పొందారు. ఈ రుణంలో బ్యాంకర్ తన వద్ద రూ 50లు వేలు డిపాజిట్ చేయించుకొని మిగతా రూ 1,49,000 లు షాపు యజమానులకు అందించారు.
ఈ రుణానికి మాలపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి జామీను దారుగా వ్యవహరించారు. కొన్ని వాయిదాలు చెల్లించారు. ఈ క్రమంలో షాపు అగ్ని ప్రమాదానికి గురై మిగతా కంతులు కట్టలేని స్థితిలో రుణగ్రహీతలు చేతులెత్తారు.
సాధారణంగా రుణకంతులు వరుసగా మూడుసార్లు చెల్లించకపోయినట్లయితే ఆ ఆస్తిని మొండి అప్పుగా భావిస్తారు.. రుణగ్రహీతను బ్యాంకర్ ఒత్తిళ్లు తేలేదు. బ్యాంకర్ మొత్తం దృష్టి గ్యారెంటీ దారుడు మాలపాటి శ్రీనివాసులపై ఉంచారు. అతను బ్యాంకులో ఉంచిన డిపాజిట్ లపై కన్నేశారు. జామీ న్ దారునికి రుణ బకాయిలు ఉన్న సంగతులు ఏనాడు తెలపలేదు.
రుణ గ్రహీత కు రూ 10 లక్షల పైగా విలువచేసే సొంత ఇల్లు ఉంది. ఆ దిశగా బ్యాంకర్ చర్యలు చేపట్టలేదు.
2014లో తీసుకున్న రుణం 20 25 ఇప్పటివరకు చెల్లించలేదు. అప్పును రెన్యువల్ చేయించలేదు, గ్యారెంటీ దారుడు రెన్యువల్ చేయించలేదు. గ్యారెంటీ దారుడు రెన్యువల్ చేయకపోతే, గ్యారెంటీ దారుడు ఒకవేళ అప్పు పత్రాలలో జామీను సంతకాలు రెన్యువల్ చేయకపోతే జామీను దారునికి ఏ మాత్రం సంబంధం ఉండదు.
సకాలంలో గ్యారెంటీ దారుడు పునరుద్ధరణ చేయలేదు. దీంతో గ్యారెంటీ దారుని కాలపరిమితి ముగిసినట్లే.
1963 లిమిటేషన్ ఆక్ట్ ఉల్లంఘన : 1963 లిమిటేషన్ యాక్ట్ ప్రకారం నిర్ణీత సమయంలో గా గ్యారెంటీ దారుడు పునరుద్ధరించకపోతే, అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడానికి బ్యాంకరుకు వీలు లేదని సుస్పష్టంగా చెబుతుంది.
నిర్దిష్ట కాలపరిమితి : రుణం గడువులోగా రాబట్టుకోవాలి. నిర్ణీత గడువు మూడు సంవత్సరాలు. మూడు సంవత్సరాలు గడువు ముగుస్తుందని బ్యాంకర్ ఒకవేళ భావిస్తే స్పందించి రుణ గ్రహీత మరియు జామీను దారుల దృష్టికి తీసుకెళ్లి రుణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి.. నిర్ణీతగా సమయం మూడు సంవత్సరాలు ముగిసింది. 2014 నుంచి 2017 కు ముగుస్తుంది 2017లో రెన్యువల్ చేయించలేదు. 2017 నుంచి 2020 మరో సారి రెన్యువల్ చేయించలేదు 20 20నుంచి 2023 వరకు రెన్యువల్ చేయించలేదు. సుమారు 11 సంవత్సరాలు పైబడింది.
ఇన్నేళ్లు మొద్దు నిద్రలో ఉన్న బ్యాంకర్లు గాఢ నిద్ర నుంచి ఉలిక్కిపడి కాల పరిమితి ముగిసిందని రుణ బకాయి కోసం యత్నాలు చేస్తున్నారు, గ్యారెంటీ దారునిపై చర్యలు తీసుకోవటానికి వీలు లేదు. సరి కదా రుణ గ్రహీత కృష్ణవేణి దంపతులు ఉరవకొండ లోని సొంత ఇల్లును అమ్ముకొని సొమ్ము చేసుకుని పామిడి మండలం కత్రిమలలో ఉంటూ మాగాని పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ 1992 కేసులో సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. గ్యారెంటీ దారుని కాలపరిమితి మూడు సంవత్సరాలే. కాల పరిమితి ముగిస్తే అంతే సంగతులని సుప్రీంకోర్టు రూలింగ్ లో తేల్చి చెప్పింది.
ఇది ఇలా ఉండగా ఐ సి ఐ సి ఐ బ్యాంకు లిమిటెడ్ వర్సెస్ సిడికో లెదర్స్ లిమిటెడ్ 2014 కేసులో సైతo గ్యారెంటీ దారుని కాల పరిమితి మూడు సంవత్సరాల వరకే, 12 సంవత్సరాల వరకు కాదని స్పష్టికరించింది.
నియమం ఏమిటంటే : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమం ప్రకారం బకాయి వడ్డీ మరియు అసలు రుణం 90 రోజులకు పైగా ఉంటే దానిని మొండి అప్పుగా పరిగణిస్తారు. అదే 12 నెలల వరకు చెల్లించని పక్షంలో సబ్ స్టాండర్డ్ ఆసక్తిగా అవుతుంది. 12 నెలలు దాటితే సందేహాస్పద ఆస్తిగా మారుతుంది. బ్యాంకు ఎన్పీఏ ని పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేయలేనప్పుడు రెండవది జరుగుతుంది. ఇది రికవరీ విలువను కలిగి ఉన్నప్పటికీ అది బ్యాంకింగ్ ఆస్తిగా కొనసాగడానికి సేకరించలేనిదిగా మరియు తక్కువ విలువగా పరిగణించబడుతోంది.
నష్ట ఆస్తులు: నిరర్థక ఆస్తులను వ్రాయలేనప్పుడు నష్ట ఆస్తులు సంభవిస్తాయి. అటువంటి ఆస్తి కొంత పునరుద్ధరణ విలువ కలిగి ఉన్నప్పటికీ అది సేకరించలేనిదిగా పరిగణించబడుతుంది. మరియు బ్యాంకింగ్ ఆస్తిగా కొనసాగడానికి చాలా తక్కువ విలువ కలిగి ఉంటుంది.

Comments
Post a Comment