ఉరవకొండ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హై స్కూల్ పాతపేట ఉరవకొండ నందు ఈనెల రెండవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ గేమ్స్ ఎడ్యుకేషన్ అమరావతి మరియు డిస్టిక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి ప్రసాద్ పుల్లా రాఘవేంద్ర తెలిపారు
ఈ పోటీలకు రాష్ట్రస్థాయి నుంచి 13 జిల్లాల బాలబాలికలు అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే క్రీడాకారులకు మరియు మేనేజర్లకు కోచులకు భోజన ఏర్పాట్లను మరియు వశతిని క్రీడాకారులకు మంచి క్రీడా మైదానాలను ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

Comments
Post a Comment