కర్నూలు: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు ఈరోజు కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో విపత్తు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రమాద సంఘటనపై మరియు ఇతర కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నాగేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, దర్యాప్తు పురోగతి, మరియు బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం తదితర విషయాలపై మంత్రులతో టీడీపీ నేతలు మాట్లాడినట్లు సమాచారం.

Comments
Post a Comment