ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. ఈ మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వజ్ర కరూర్ మండలం లో సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు
రైతులందరికీ ఆర్బిఐ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు రెండు లక్షల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని గత సంవత్సరము రుణాలు ఇవ్వాలని కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తే టైం అయిపోయిందని చెప్పారు ఈసారి అయినా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి పెట్టబడదారులకు ప్రైవేట్ కార్పొరేటర్లకు బ్యాంకు రుణాలు ఇస్తారు కానీ రే అనకా పగలనకా కష్టపడి పంటలు పండించే కౌలు రైతులకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు ప్రభుత్వము కౌలు రైతులపై దృష్టి పెట్టి రుణాలు ఇప్పియ్యాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గము కౌలు రైతుల సంఘం కార్యదర్శి పెద్ద ముస్తూర్ వెంకటేశులు ఉరవకొండ నాయకుడు సుంకన్న ప్రసాదు తట్రకల్లు కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు లోకేష్ భారతి బండెప్ప వెంకటేశులు కౌలు రైతులు పాల్గొన్నారు

Comments
Post a Comment