![]() |
| ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడదరబెంచి,డొనేకల్లులో సంతకాల సేకరణ. |
ఉరవకొండ: విడపనకల్ మండలం కడదరబెంచి, డోనేకల్ గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పేద,మధ్యతరగతి ప్రజలకు వైద్యవిద్యను దూరంచేయాలన్న దుర్బుద్ధికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో కడదరబెంచి,డొనేకల్ గ్రామాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటీకరణను స్వాగతిస్తే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద,మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య కఠిన తరమవుతుందని, కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని వ్యతిరేకించాలని,రాబోవు రోజులలో ప్రజాఉద్యమంలా మారి,కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడనాడి,వెంటనే ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రాకెట్ల అశోక్ కుమార్,మండల కన్వీనర్ రమేష్,విడపనకల్ మండల సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి,మండల ఉపాధ్యక్షుడు బోయ నాగేంద్ర,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఉమాశంకర్,నాయకులు హంపయ్య,హేమంత్,గోపాల్,బద్రి,శేఖర్,మారయ్య,చిదంబరంరెడ్డి,రమేష్ రెడ్డి,బ్రహ్మానంద రెడ్డి,గిరి,రామంజి, నందరెడ్డి,ముని తదితరులు పాల్గొన్నారు.

