శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవం: వాల్మీకి విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్ ఘన నివాళులు

Malapati
0



అనంతపురం:ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవాన్ని మంగళవారం అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నగరంలోని పాతూరు విద్యుత్ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ వాల్మీకి సర్కిల్లోని శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు పుష్పామాలాలంకరణ చేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మరియు ఇతర ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ కూడా శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిపిఓ నాగరాజునాయుడు, వాల్మీకి డైరెక్టర్, నాయిబ్రాహ్మణ డైరెక్టర్, ఆయా సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!