ఉరవకొండ అక్టోబర్ 16:
ఉరవకొండ విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య AIFDS ప్రథమ జిల్లా మహాసభ ఉరవకొండ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డక్క కుమార్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై ఏఐఎఫ్డిస్ఐ విద్యార్థి సంఘం స్వార్ధంగా పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. ఇందులో భాగంగా గతంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కోసం అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించామన్నారు. ఇటువంటి పోరాట ఫలితంగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందయన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో బిజెపి ప్రభుత్వం విద్య కాషాయీకరణం చేపట్టిందని దాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వాలు కట్టుకున్నాయన్నారు. అదే విదంగా పీపీపీ పేరుతో ప్రవేటికరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యా దూరం అవుతుంది అన్నారు. అదేవిదంగా విద్యార్థి సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా ఈ రాష్ట ప్రభుత్వం దొంగ జీవోలు ఇచ్చి ఈరోజు విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలను వెళ్ళనివ్వకుండా విద్యార్థి సమస్యలు తెలుసుకోకుండా విద్యార్థుల సమస్యలు చెప్పుకోకుండా చేస్తున్నారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ యంత్రం మీద దాడి చేసి రాజ్యాంగం మౌలిక సూత్రమైన బావ బకటన స్వేచ్ఛను అరిస్తున్నారన్నారు. ఆ జీవోను వెనక్కి తీసుకోకపోతే దీనిమీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న విద్య కాషాయీకరణ కుట్రను అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిస్ అధ్యక్ష కార్యదర్శులు నందు,సిద్దు,జిల్లా నాయుకులు తరుణ్, మధు, కుళ్లాస్వామి,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment