జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ ను నిలిపివేయడంతో ప్రాజెక్ట్ కు అదనపు ఖర్చుతో పాటు రాష్ట్ర రైతాంగం 50 వెల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయారు. 2019 మేలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేస్తూ జీవో ఇచ్చాడు. పనులు చేస్తున్న ఏజెన్సీలను రద్దు చేయకుండా, అధికారులను బదిలీ చేయకుండా అక్కడే ఉంచినట్లైతే, 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు.
సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్.పాటిల్ గారు మరియు పిపిఏ, సిడబ్ల్యూసి అధికారులు, ఏజెన్సీలు, నిపుణులతో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Comments
Post a Comment