మత్స్యకారులతో సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
సబ్సిడీతో వచ్చే బోట్లను మత్స్యకారులు తీసుకుని ఆర్ధికంగా ఎదిగే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ రాం శంకర్ నాయక్ లతో ఎమ్మెల్యే పాల్గొన్నారు
. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్రాన్ని నమ్ముకొని రోజూ ప్రాణాలు పణంగా పెట్టి జీవనం సాగిస్తున్న మత్స్యకార సోదరుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లే మత్స్యకారులకు కూడా అదే విధంగా ప్రయోజనం వచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడానికి కృషి చేస్తామన్నారు. మీరు లైసెన్సులు సక్రమంగా పొందితే ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతాయన్నారు. సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీలు, రుణ సౌకర్యాలు సులభంగా లభిస్తాయని
పేర్కొన్నారు. అలాగే ఆధునిక సాంకేతికతతో వచ్చిన ఈ హార్బర్లలో చిన్న జెట్టీలు ఏర్పాటు చేసి మత్స్యకారులు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మీ సమస్యలను పరిష్కరించడంలో నేను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. మీ కష్టాలను మీ పిల్లలు ఎదుర్కోకుండా చేయడమే మా సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ, మెరైన్ అధికారులు, స్థానిక ప్రజా పతినిధులు, మత్స్యకారులు, మత్స్యకార కాపులు పాల్గొన్నారు..


Comments
Post a Comment