బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలి; ప్రభుత్వం మారినా అధికారి తీరు మారలేదని ఆగ్రహం
ఉరవకొండ, అక్టోబర్ 23:
విశాఖపట్నం ఆర్డీఓ (RDO) శ్రీలేఖను వేధింపులకు గురిచేస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ముఖ్య ఉన్నతాధికారిని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఉరవకొండ తాలూకా కాకతీయ సేవా సమితి అధ్యక్షులు, సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు ఓ ప్రకటనలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మారినప్పటికీ, సదరు అధికారి తీరులో మార్పు రాలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ శ్రీలేఖపై కక్ష సాధింపుగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, "సదరు సీఎంఓ అధికారి చేసే అరాచకాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన శ్రీలేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం సరైన పద్ధతి కాదు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లెక్క చేయలేదనే దురుద్దేశంతోనే ఆ అధికారి శ్రీలేఖను ఇబ్బందులకు గురి చేస్తున్నారని" తెలిపారు.
నిజాయితీ గల అధికారి అయిన శ్రీలేఖకు ఆమె కమ్మ కులమే శాపమైందని ఆ ఉన్నతాధికారి అరాచకత్వంపై మాలపాటి శ్రీనివాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారికి వేధింపులు, అవమానాలు ఎదురవుతున్నాయని నిలదీశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై తక్షణమే స్పందించి, ఆ సీఎమ్ఓ అధికారిని విధుల్లోంచి తప్పించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

Comments
Post a Comment