ఉరవకొండ అక్టోబర్ 21:
సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణంలో జలపాత హొయలు యాత్రికులకు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పెన్నో బిలం అనగానే అటు ఆధ్యాత్మిక క్షేత్రం ఇటు ప్రకృతి రమణీయతకు కేంద్ర బిందువు.
లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలగోపురానికి దిగువన ఉన్న జలపాతాలు వంపు సొంపులతో వయ్యారంగా నిండుగా ప్రవహిస్తుంది.
చెట్టు చేమల గుండా తుంగభద్ర నీరు ప్రవహిస్తుంది. జలపాత హోయలు తిలకించడానికి జిల్లా నలుమూలనుంచి భక్తులు, పర్యటకులు వస్తూ ప్రకృతి అందచందాలను ఆస్వాదిస్తున్నారు పెన్నోబులంలో రెండు జలపాతాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. జలపాతాల చుట్టూ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి.జలపాత ప్రాంతంలో నీటి అందాలను తిలకించే క్రమంలో కాలుజారి పడి భక్తులు,పర్యాటకాలు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి.
బుగ్గన కోనేరు నిండిపోయింది: బసవుడి నోటి నుంచి చెట్లు చేమల మధ్య నుంచి నీరు వస్తుంది ఇది పెన్నోబిలానికి అత్యంత ఆకర్షణ.
బ్రిడ్జి ప్రాంతంలో నీరు పరవళ్ళు తొక్కుతోంది ఇక్కడ గంగాదేవి ఆలయం ఉంది భక్తులు పర్యాటకులు
నదిస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. మొత్తానికి అటు ప్రకృతి రమణీయత మధ్య ఇటు ఆధ్యాత్మికత మధ్య తుంగభద్రమ్మ పరవళ్ళు తొక్కుతూ అందాలను తిలకిస్తూ తన్మయం పొందుతారు.


