అనంతపురం జిల్లా: సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకు బంజారా సంప్రదాయ రీతిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే గురు నానక్ సామా సంగ్ మహారాజ్ భోగ్ పూజ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ పలువురు రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రాలు అందజేశారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులుకు, అలాగే శాసనమండలి సభ్యులు (MLC) మరియు ప్రివిలైజ్డ్ కమిటీ అధ్యక్షులు వై. శివరామిరెడ్డికి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు శ్రీనివాసులుకు పూజా కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రాలను అందించారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తులసీదాస్ నాయక్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి. గోపాల్ నాయక్, మాజీ ఎంపీ స్వామి నాయక్, బంజారా ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్.కె. కమల్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment