గుంటూరు కార్పొరేషన్...
గుంటూరు నగరంలో చెరుకు రసం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక మహిళపై టౌన్ ప్లానింగ్ విభాగం అకస్మాత్తుగా ‘రోడ్డు అక్రమణ’ పేరిట చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
గత ఏడాది నుంచి కార్పొరేషన్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ తన సమస్యను చెప్పుకున్నా, న్యాయం దక్కలేదని ఆ మహిళ వేదన వ్యక్తం చేసింది. రోజుకు ₹300–₹500 వరకు చెరుకు రసం అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తున్న ఆ మహిళ జీవనాధారం ఒక్కసారిగా నశించింది.
కమీషనర్ గారిని మూడు సార్లు కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె చెబుతోంది. "కొత్తగా తెచ్చుకున్న చెరుకు మిషన్‌ని కూడా ఎత్తుకెళ్లి, పనికిరాని పాత మిషన్‌ను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారు," అని ఆవేదనతో వివరించింది.
పౌరుల జీవనోపాధిని కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల పేరుతో చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధానం పునరాలోచించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Comments
Post a Comment