ఉరవకొండ అక్టోబర్ 18:
వైద్య కళాశాలల ప్రవేటీకరణను అడ్డుకుంటామని జెబిపి జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రైవేటీకరణ పై రౌండ్ టేబుల్ సమావేశం లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రవేటీకరణకు అప్పగిస్తే సామాన్య, మధ్యతరగతి, హరిజన, గిరిజన కుటుంబాలకు వైద్య విద్య అవకాశాలు కనుమరుగౌతాయన్నాడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రవేటీకరణ విధానానికి స్వస్తి చెప్పాలని లేకుంటే భవిష్యత్లో అన్ని వర్గాల ప్రజలను, సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జెబిపి అర్బన్ ఇన్చార్ కొడవండ్ల నరేష్. జైభీమ్ రావ్ భారత పార్టీ. జిల్లా కన్వీనర్ వడ్డేర్ల వీర. వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్. నాయకులు .శుఖ్య నాయక్. ప్రసాద్ నాయక్. చేపల సర్పంచ్ మల్లెల జగదీష్. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం పురుషోత్తం. ముష్టుర్ ఎర్రి స్వామి. ధనుంజయ. పోలేరి. ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు మధు ప్రసాద్. ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కార్యదర్శి. జంగం కుమారు స్వామి. తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment