నవంబర్ 2025 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 2025 1న (నేడు) పంపిణీ....
నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్
ఉరవకొండ మన జన ప్రగతి నవంబర్ 30:
అనంతపురము, నవంబర్ 30: నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 01 వ తేదీ న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం అని జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్, ఐ.ఏ.ఎస్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 1వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.30 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ లో సూచిస్తూ నవంబర్ మాసం పెన్షన్లను డిసెంబర్ 1 వ తారీఖున పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని ఈ నెల నవంబర్ 29 నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీ లో ఉంచుకొన్న మొత్తాన్ని, డిసెంబర్ 1 వ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయుట కొరకు వారి పంపిణి ప్రదేశాలకి చేరుకొని ఉదయం 6.30 గం లకు యాప్ ఓపెన్ అయ్యాక పింఛను దారులకు పింఛన్లు పంపిణి చేపట్టాలని సూచించారు.
డిసెంబర్ 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ పింఛనుదారుల ఇంటివద్దనే పింఛను ఇవ్వాలని, పింఛనుదారు ఇంటి నుండి ఖచ్చితంగా 300 మీటర్ల పరిది దాటితే పని చేయదని, ఏ కారణం చేతనైనా ఇంటివద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలయునని తెలియచేసారు. పింఛను దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా చిరునవ్వు తో పింఛను పంపిణీ చేయవలయునని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా పింఛను తీసుకోని లబ్ధిదారులకు వారి యొక్క చరవాణి కి సందేశం పంపబడుతుంది. వీరికి 02.12 .2025 తేదీ మధ్యాహ్నం 02.00 గం.ల నుండి 05.00 గం.ల వరకు గ్రామ/వార్డు సచివాలయంలో సంబంధిత PS/WEA, WWDS/WAS వీరికి పించను మొతాన్ని తప్పనిసరిగా పంపిణి చేయాలని తెలిపారు. పెన్షన్ల పంపిణీ డిసెంబర్ 1న అదే రోజు 100 శాతం ఫించన్ల పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మునిసిపల్ కమీషనర్లు పింఛను పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి పంపిణీ ప్రదేశానికి ఉదయం 6.30 గం.ల లోగా చేరుకుని తప్పకుండా ఆరోజు ఉదయం 7.00 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పెన్షన్ పంపిణి చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలని, అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయవలెనని తెలియజేశారు. ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమశిక్షణా చర్యలు తీసుకోబడునని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే గత నెలలలో ఏదేని కారణంతో ఫించన్ తీసుకోని వారికి ఈ నెల పించన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. కావున ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులను, మునిసిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫించన్ దారులకు అందరికీ IVRS విధానం పై వ్యక్తిగతంగా తెలియచేయాలని కలెక్టర్ తెలిపారు.

Comments
Post a Comment