ఉరవకొండ
డిహెచ్ 256 వేరుశనగ నూతరకాన్ని ఉరవకొండ నియోజకవర్గం లో యువ రైతు దంపతులు (రఘు అంబిక) ఖరీఫ్ సీజన్లో ఒకటి 1.5 ఎకరాలలో నల్లరేగిడి పొలంలో డిహెచ్256 వేరుశనగ విత్తనాలను ప్రయోగపూర్వకంగా సాగు చేశారు, దీనితో అధిక దిగుబడి వచ్చింది.ఈ సీజన్లు విపరీత వర్షాలు వచ్చినప్పటికీ మంచి నాణ్యతతో కూడిన 60 నుంచి 70 బస్తాలు వేరుశనగ కాయలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు దంపతులు తెలియజేశారు. తక్కువ విత్తనం మోతాదు, తెగుళ్లు, పురుగులను & దోమలను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యం ఉండటం, ప్రక్క కు కొమ్మలు అధికంగా రావడం, ఎక్కువ కాయలు కాయటం, ఆకు దిగుబడి అంటే పొట్టు కూడా ఎక్కువ గా రావటం చేత రైతులoదరికీ లాభ సాటిగా ఉంటుందనితెలిపారు. డిహెచ్256 వేరుశనగ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేశారు*
*DH-256 యొక్క ముఖ్య లక్షణాలు*: *ఆరిజిన్: వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం (యుఎఎస్), ధార్వాడ వేరుశనగ పరిశోధన కేంద్రం చేత అభివృద్ధి చేయబడిన స్పానిష్ బంచ్ వేరుశనగ రకం DH-256, ఈ వేరుశనగరకం తుప్పు తెగులు మరియు సర్క్కోస్ఫర ఆకుమచ్చ తగులను తట్టుకోవటంలో ప్రసిద్ది చెందింది మరియు స్పోడోప్టెరా, త్రిప్స్ మరియు లీఫ్‌హాపర్స్ వంటి పురుగులను తట్టుకుంటుంది. ఇది ఖరీఫ్ సీజన్లో హెక్టారుకు 3258 కిలోల పాడ్ దిగుబడిని దిగుబడి ఇస్తుంది, 110-115 రోజుల్లో పరిపక్వం చెందుతుంది మరియు వివిధ పంట పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు


Comments
Post a Comment