ఆంధ్రప్రదేశ్ 69వ అవతరణ దినోత్సవం: ఘనంగా వేడుకలు

Malapati
0


 


ఉరవకొండ,  నవంబర్ 1, 2025]

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 69వ అవతరణ దినోత్సవాన్ని ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో, ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పటాన్ని పూలమాలతో అలంకరించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది, సీనియర్ ఎలక్ట్రీషియన్ గోపాల్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తుచేశారు. ఈ మహోన్నత పోరాటంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయక అర్పించిన పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నిరంజన్ గౌడ్, సోషల్ వర్కర్ లెనిన్, ముండస్ ఓబులేసుతో పాటు ఇతర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!