![]() |
| ఫిర్యాదుదారుని బంధువుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరుకు రూ.40,000 లంచం డిమాండ్. |
అందులో భాగంగా రూ.20,000 స్వీకరిస్తూ అరెస్ట్
టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్ పరిధిలోని గోపాల్‌పేట సెక్షన్ సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుని బంధువుకు చెందిన వ్యవసాయ భూములకు డిటిఆర్ మంజూరు చేయడానికి మొత్తం రూ.40,000/- లంచం కోరగా, అందులో అడ్వాన్స్‌గా రూ.20,000/- స్వీకరిస్తున్న సమయంలో అధికారులు రంగహాజరై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
