ఏపీ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని, సాగు చేసిన పంటలను ఈ క్రాప్ నమోదు చేయాలని తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం అయినది
ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సురేషు ముస్టుర్ వెంకటేశులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉరవకొండ నియోజకవర్గం లో దాదాపుగా 20,000 మంది పైగా కౌలు రైతులు ఉన్నారన్నారు అందులో ప్రభుత్వం గుర్తించి కేవలం నియోజకవర్గం లో వెయ్యి మందికి మించి సిసిఆర్సి కార్డులు ఇవ్వలేదన్నారు కార్డ్ ఉన్న రైతులకు బ్యాంకు రుణాలు ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అన్నారు కనీసం కౌలు రైతులు సాగుచేసిన పంటలను ఈక్రాప్ నమోదు చేయలేదన్నారు కౌలు రైతుల కోసం నూతన చట్టం చేస్తామని మాయమాటలు చెప్పారన్నారు ఈ క్రాప్ చేసిన పంటలను తక్షణమే జెడి ఆఫీస్కు వాటి వివరాలు పంపించి కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సహకరించాలని డిమాండ్ చేశారు రేణుమాకులపల్లి గ్రామంలో ని సచివాలయ అగ్రికల్చర్ అధికారి కౌలు రైతులకు వేసిన పంటలను ఈక్రాప్ నమోదు చేయకుండా కౌలు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు వెంటనే అగ్రికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు వేణుమాకులపల్లి కౌలు రైతులు పై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో నాయకులు సుంకన్న ధనంజయ మోపిడి ప్రసాద్ లాలేప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment