![]() |
| ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు విడుదల |
ఉరవకొండ:: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాత ముగింపు సభని జయప్రదం చేయాలని కోరుతూ ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గత నెల అక్టోబర్ 22న ఇచ్చాపురంలో ప్రారంభమై నవంబర్ 12వ తేదీ అనంతపురంలో ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 6400 కోట్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేసి తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వైద్య విద్యకు శాతంగా మారిన జీవో నెంబర్ 107 108 మరియు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నరా లోకేష్ ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే జీవో నెంబర్ 107 108 77 రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల కేజీబీవీ మోడల్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు భర్తీ చేయకుండా మూడు నాలుగు హాస్టళ్లకు ఒకరే వార్డెన్ లో నియమించడం వల్ల విద్యార్థులు సరైనటువంటి సౌకర్యాలు అందడం లేదని మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పైన రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాత ముగింపు సభను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కోశాధికారి రాజు ఉపాధ్యక్షులు కరుణాకర్ నియోజకవర్గ నాయకులు సిద్ధిక్, మన్సూర్ వలి తదితర విద్యార్థులు పాల్గొన్నారు

Comments
Post a Comment