ఉరవకొండ నవంబర్ 26
ప్రత్యేక దృష్టితో గిరిజన గ్రామాల అభివృద్ధి సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక బృహత్తర పథకాలతో అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగానే గిరిజన గ్రామాల అభివృద్ధికి 20 శాఖల సమన్వయంతో ధర్తీ ఆభా జన జాగృతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా అనేక మౌలిక సదుపాయాలకు వేలకోట్లు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి జిల్లా అధికారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బంజారా సంఘం జాతీయ నేత సేవా గడ్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఎస్.కె కేశవ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండ గ్రామపంచాయతీ నందు దర్తీయాబా జన జాగృతి ఉత్కర్ష అభియాన్ పనుల కింద మంజూరైన సిసి రోడ్డు పనులను భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బంజారా సంఘం ప్రతినిధి నంగ రేర్ నాయక్ ఎస్ కే సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ముందుగా దేశ ప్రధాని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.కె దాసు నాయక్ మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్ మాజీ ఎంపీపీ వెంకటమ్మ బాయ్ మాజీ సర్పంచ్ సోమీబాయి రామక్కబాయి మాజీ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కె మంగా నాయక్ డి గోపాల్ నాయక్ సూర్య నాయక్ డి తొలిచా నాయక్ ఎర్రి స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment