ఢిల్లీ:
దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ
ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత
‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం
గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ
బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే
సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త శకం
సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే, మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ, ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతాచావ్లా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు. చట్టపరమైన నిబంధనల దృష్ట్యా, ఆమె మరణించిన ఐదు నిమిషాల్లో పే.

Comments
Post a Comment