రిజర్వేషన్లు ఎవరికి లాభం?. కేవి రమణ

Malapati
0


 

ప్రత్యేక బహుజన దేశం ఏర్పాటు తప్పదు!

నేడు సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబాపూలే వర్ధంతి

3000 సంత్సరాలుగా రిజర్వేషన్లు

అనుభవించిందెవరు? మీడియా,సినిమా ఇండస్ట్రి, పరిశ్రమలు,మైన్స్,

భూములు,మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు,వ్యాపారాలు,కోల్ మైన్స్, అయిల్ రిఫైనరీస్, ప్రైవేట్ సెక్టార్,భూములు,

గుడుల మీద పెత్తనం, IT సెక్టార్,ప్రైవేట్ ఎడ్యుకేషన్, కార్పోరేట్ హాస్పిటల్స్,స్పోర్ట్స్ ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్స్, సినీ ఫీల్డ్,పాలిటిక్స్ లో రిజర్వుడు స్థానాలు తప్ప, ఇవన్నీ ఎవరికి రిజర్వుడు చేయబడ్డాయి?

    స్విస్ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు బయట పేడితే ST, SC, BCలు ఎంతమంది ఉన్నారు?

    స్వాతంత్ర్యానంతరం78 సంవత్సరములలో బ్యాంకులను మోసం తీసిన వారిలో SC, ST, BC లు ఎంతమంది ఉన్నారు?

  ‌‌ బోర్డ్ తిప్పేసిన ఇన్సూరెన్స్ కంపెనీలలో SC,ST,BC లు ఎంతమంది?

      ప్రభుత్వాలు SC, ST, BC, OC లకు మొండి బకాయిల రూపంలో ఏ ఏ కులానికి

ఎంత మొత్తంలో రుణం మాఫీ చేసింది?గవర్నమెంట్ స్కూల్స్ లో SC,ST,BC,OC పిల్లల శాతం ఎంత?అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎవరి శాతం ఎంతో చెప్పాలి.

    అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు అంటున్నారు. నిజమే అన్ని కులాలలో

 పేదలు ఉన్నారు.

మరి ఎస్సీ,ఎస్టీ,బీసీలు లాగా రిక్షాలు తొక్కడం,డ్రైనేజీలు శుభ్రం చేయడం,బస్తాలు మోయడం,లాంటి పనులు చేయమంటే అగ్రవర్ణాలు మినిమం గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యి ఉండాలని అంటారెందుకు?

   మాట్లాడితే చాలు దేశం అభివృద్ధి చెందలేదు అంటారు.దేశం డెవలప్ కానిది

దేశ సంపదలో 2% కూడ లేని రిజర్వేషన్స్ వలనా లేక సరిగా ట్యాక్స్ కట్టక పోవడం,లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని విజయ్ మాల్య, నీరవ్ మోడి, కొంతమంది అవినీతి పొలిటీషియన్స్, 

కుల కంపుతో,మతం మత్తులో మునిగిన మోసగాళ్ల వల్లనా?

      ప్రైవేట్ సెక్టారులో జాబ్స్ పొందుతున్నది ఎవరు? ‌ పబ్లిక్ సెక్టార్ లో మొత్తం రిజర్వేషన్లు 49%

BC-27%, SC-15%, ST-7%.వీరి జనాభా 97 శాతం.

మనదేశాన్ని,విదేశీయులయిన మొగలాయిలు,హూణులు, మహమ్మదీయులు,అరబ్బులుడచ్,పోర్చుగీసు,

ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారికి అప్పచెప్పి,వాళ్ళ దగ్గర బానిసలుగా,పాలేరులుగా ఉండి,గులాం గిరి చేసి, ఇనాములు పుచ్చుకున్నది ఎవరు? 

    3000 సంవత్సరాలుగా బహుజనుల పట్ల వీరు చూపించిన వివక్ష చెబితే చాట భారతమౌతుంది.

       ఇక్కడ అవకాశాలు లేక విదేశాలకు పోతున్నది ఎవరు? US, UK, దుబాయ్, కువైట్లే ఎందుకు వెళుతున్నారు? పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ఎందుకు పోలేదు? ఒకవేళ పేదలే విదేశాలకు పోతుంటే ఇక్కడ రిక్షాలు తొక్కుతున్నది,

పొలం పనులు,రోడ్లు ఉడ్చే పనులు చేస్తున్నది కూడా పేదోళ్ళే కదా.మరి వీరు కూడా వారిలాగా విదేశాలకు వెళ్లిపోవచ్చుకదా.ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.

     అందరూ పేదవారే, కానీ అయితే మంచి బట్టలు వేసుకోకూడదని అగ్రవర్ణాల మీద ఎప్పుడైనా దాడి జరిగిందా?

పేదవాడివి కాబట్టి పెళ్ళికి తలపాగా పెట్టుకున్నావని,

గుర్రమెక్కి ఊరేగావని, ఎవరి మీద దాడులు చేస్తున్నారు?

పేదవాడైనా కూడా బాగా చదువుతున్నావని రాళ్ళ దాడి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ?

పేదవాడు కాబట్టి ఇష్టమైన నాయకుడి పాట రింగ్ టోన్ పెట్టుకున్నాడన్న కారణంతో., ఘోరంగా హత్య గురైన వాడెవడైనా ఉన్నాడా?

పేదవాడివైన కారణంగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే మీ ఆడవాళ్ళను బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెట్టిన సందర్భాలు ఎన్నున్నాయి?

పేదవాడైన కారణంగా గుడిలోకి,బడిలోకి అడుగు పెట్టొద్దంటూ నిన్ను ఎవరైనా కొట్టి చంపారా?

పేదవాడివి కాబట్టి ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు తిరుగుతున్న చెరువులో కూడా నువ్వు మంచినీళ్ళు అంటుకోవడానికి వీల్లేదని నిన్నెప్పుడైనా ఆపారా ?

పేదవాడివి కాబట్టి వేరే కులంవాడు తాగే గ్లాసు ముట్టుకున్నావని మలం నోట్లో పెట్టి తినమని కొట్టారా?

పేదవాడివి కాబట్టి

నీ అక్క చెల్లెళ్ళను జోగిని, బసివిని చేసి

ఊరంతా అనుభవించిన సందర్భం ఏదైనా ఉందా ?

పేదవాడివి కాబట్టి మంత్రాలు చేస్తున్నావు అనే నెపంతో ఊరంతా కలిసి చెట్టుకు కట్టేసి, కొట్టి చంపి సజీవ దహనాలు ఎక్కడ చేశారో చూపించండి?

పేదవాడివి కాబట్టి చేతబడి చేస్తున్నారంటూ ఊరంతా కలిసితో నీ అక్క చెళ్ళెళ్ళను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారాలు చేసి చంపారా?

పేదవాడివైన కారణంగా

అగ్రకుల ఊరి పెద్ద కనిపిస్తే లేచి కూర్చోలేదనే కారణంతో వికలాంగురాలని కూడా చూడకుండా,నీ ఇంటి ఆడవాళ్ళును నగ్నంగా ఊరేగించిన సందర్భం చూపించు ?పేదవాడివి కాబట్టి ప్రేమించినందుకు మీ అమ్మతో అందరి ముందూ నిన్ను కాపురం చేయమని ఏ గ్రామ సభైనా తీర్పు ఇచ్చిందా?

పేదవాడివి కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళను సామూహిక అత్యాచారం చేయాలని

ఏ గ్రామ పంచాయితీలు తీర్పులిచ్చాయి?పేదవాడైన కారణంగా నీ హక్కుల కోసం రోడ్డెక్కితే కుక్కల్ని కాల్చినట్లు పోలీసులు పేల్చిన తూటాలకు నీ అన్న దమ్ములు ఎంత మంది బలయ్యారు? ఇప్పుడు చెప్పండి ఎవరు పేదవారు?

     ఒకఖైర్లాంజీ,ఒకచుండూరు,

ఒక కారంచేడు,ఒక నీరుకొండ,

ఒక ప్యాపిలి,ఒక కిలవెన్మని,

ఒక వేంపెంట,ఒక దాద్రి,

ఒకనోయిడాఘర్లలో కాటేసిన కుల రక్కసి రక్త దాహానికి ఎక్కడైనా బలైపోయారా? 

అంగన్వాడీల్లో,పాఠశాలల్లో అన్నం వండితే తినం అని బహిష్కరించిన సందర్బాలున్నాయా?

     వీధి బడుల నుండి విశ్వవిద్యాలయాల వరకు,మరుగు దొడ్ల నుండి సుప్రీం కోర్ట్,పార్లమెంటు దాకా బహుజనుల మీద రోజూ జరుగుతున్న దాడులు బహుజనుల మూగ రోదనలకు సాక్ష్యాలే.

    కాబట్టి నాగరికతకి, విద్యకి బహుజనులను 3000 సంవత్సరాలు దూరం చేసినదానికి,మానవ సమాజం లోకి వచ్చి కుదురుకోవటానికి ఒక అవకాశం ఇచ్చారే కానీ

ఎవడి సొమ్ము అప్పనంగా దోచిపెట్టలేదు.

    బహుజనులు అడుగుతున్నది రిజర్వేషన్లు కాదు,"కమ్యూనల్ అవార్డ్‌".కానీ అది దక్కకుండా కుట్ర చేసారు.దానికి కంటితుడుపు చర్యలే ఈ రిజర్వేషన్లు.

     కమ్యునల్ అవార్డ్ అంటే

"పూనా ఒడంబడిక"ఆ పూనా ఒప్పందం చదివితే కమ్యూనల్ అవార్డు ఏమిటో తెలుస్తుంది.

    రిజర్వేషన్లను గురించి మాట్లాడి వారు జాగ్రత్తగా మాట్లాడాలి,లేకుంటే పై ప్రశ్నలన్నీ అడగాల్సి వస్తుంది.

     రిజర్వేషన్లు వద్దనుకుంటే అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోండి. మా బతుకులేవో మేం బతుకుతాం.అప్పుడైనా ప్రత్యేక బహుజన రాజ్యం ఏర్పడుతుంది.



Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!