డిసెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అనంతపురం నగరం ఆదర్శనగర్ లో గల గంగపుత్ర కమ్యూనిటీ హాల్ యందు బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో, సవేరా హాస్పిటల్ యాజమాన్యంతో,ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు,ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంఘం జిల్లా ఆఫీసులో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం అందని ద్రాక్ష పండు అయిన నేటి తరుణంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, వ్యాధుల నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్సలు పొంది ఆరోగ్యావంతులుగా జీవించాలని,ఆ రోజు గుండె నొప్పి,చాతి నొప్పి,గుండె దడ, ఆయాసం,కళ్ళు తిరగటం, కళ్ళు సరిగా కనపడకపోవడం, గుండెలో మంట కలగటం,ఛాతిలో బరువుగా ఉండటం,నిద్రలో ఆయాసం, కాళ్లు వాపులు రావడం చెమటలు పట్టడం,మహిళల గైనిక్ సమస్యలకు సంబంధించిన డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారు.కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆరోజు ఉచిత భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలియజేశారు.
కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు. కె.వి రమణ,గౌరవాధ్యక్షులు బాలసుబ్రమణ్యం,ఆలంబన స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ మేక జనార్ధన్,వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్,ఉపాధ్యక్షులు గంగప్ప,ట్రెజరర్ నాగేంద్ర, పాపన్న,రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి. కే.శ్రీనివాసులు, సిండికేట్ నగర్ శంకర్,జయశంకర్,వెంకీ, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment