అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామానికి చెందిన చల్లా అనంతయ్య యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అనంతపురం పట్టణంలోని నక్కా రామారావు యాదవ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో, జాతీయ కార్యనిర్వాహాక అధ్యక్షులు డా. లాకా వెంగలరావు యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా చల్లా అనంతయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యాదవ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మరియు తెదేపా జిల్లా నాయకులు రేగాటి నాగరాజు, గొల్ల గోపాల్, గొల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment